'నీ కొత్త ప్రయాణం చూస్తుంటే ఆనందంగా ఉంది'.. రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్ | Ram Charan Special Wishes To New Couple Allu Sirish And Nayanika, Special Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Ram Charan: 'నూతన జంటను ఆశీర్వదించిన రామ్ చరణ్'.. ట్వీట్‌ వైరల్

Mar 7 2026 2:35 AM | Updated on Mar 7 2026 4:08 PM

Ram Charan Special Wishes To new couple allu sirish and nayanika

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్- నయనిక జంటకు మెగా హీరో రామ్ చరణ్ విషెస్ చెప్పారు. పెళ్లి వేడుకలో పాల్గొన్న చెర్రీ నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అల్లు శిరీష్-నయనిక జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. నయనికతో ఈ అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు శిరీష్‌ను అభినందించారు. మీ వైవాహిక జీవితం ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు.

కాగా.. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్‌ వెడ్డింగ్‌ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్‌లో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వెడ్డింగ్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లికి హాజరైన రామ్ చరణ్ నూతన జంటను ఆశీర్వదించారు.

కాగా.. అల్లు శిరీష్‌- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్‌ భార్య షాలినికి నయనిక బెస్ట్‌ ఫ్రెండ్‌ కావడం మరో విశేషం. వరుణ్‌తేజ్‌- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్‌కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్‌ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. ‍అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement