శర్వానంద్ హీరోగా వస్తోన్న రేసింగ్ చిత్రం బైకర్. ఈ సినిమాకు అభిలాష్ కంకర దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ–ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డాల్బీ సినిమా, ఈపీఐక్యూ, 4డీఎక్స్, పీసీఎక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలోనూ విడుదల కానుంది.
ఇప్పటికే ఓ సాంగ్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. జిద్దీ జిద్దీ అంటూ సాగే ఈ పాట ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఈ పాటను కంపోజ్ చేసిన జిబ్రాన్ తానే ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.


