బ్యాండ్‌ మేళం: రామ్‌ మిరియాల పాడిన బ్రేకప్‌ సాంగ్‌ రిలీజ్‌ | Rajamma Lyrical Video out from Band Melam Movie | Sakshi
Sakshi News home page

Band Melam Movie: రాజమ్మ ఇడిసిపోయిందిరో.. బ్రేకప్‌ సాంగ్‌ విన్నారా?

Mar 6 2026 1:40 PM | Updated on Mar 6 2026 1:53 PM

Rajamma Lyrical Video out from Band Melam Movie

కోర్ట్‌ జంట హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బ్యాండ్‌ మేళం. సతీష్‌ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా సినిమా నుంచి రాజమ్మ అనే మరో పాట వదిలారు.

బ్రేకప్‌ సాంగ్‌
'రాజమ్మ ఇడిసిపోయిందిరో.. రాజమ్మ పొడిసిపోయిందిరో.. నన్నింకా మరిసిపోయిందిరో..' అంటూ హీరో బ్రేకప్‌ సాంగ్‌ పాడుతూ బాధతో స్టెప్పులేస్తున్నాడు. విజయ్‌ బుల్గనిన్‌ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్‌ లిరిక్స్‌ చేకూర్చగా రామ్‌ మిరియాల ఆలపించాడు.

సినిమా
బ్యాండ్‌ మేళం విషయానికి వస్తే.. మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. నిజానికి ఈ సినిమా మార్చి 13న విడుదల కావాల్సింది. కానీ దాన్ని పదమూడు రోజులపాటు వాయిదా వేశారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement