శ్రీరామ నవమికి... | Band Melam Movie set for Sri Rama Navami release on March 26 | Sakshi
Sakshi News home page

శ్రీరామ నవమికి...

Mar 6 2026 2:50 AM | Updated on Mar 6 2026 2:50 AM

Band Melam Movie set for Sri Rama Navami release on March 26

శ్రీరామ నవమికి ప్రేక్షకులకు బ్యాండ్‌ మేళం వినిపించ నుంది. ‘కోర్ట్‌’ మూవీ ఫేమ్‌ హర్ష్ రోషన్, శ్రీదేవి  అపల్లా జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్‌ మేళం’. సతీష్‌ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 13న రిలీజ్‌ చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే... శ్రీరామ నవమి సందర్భంగా 26కి విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించారు మేకర్స్‌. ‘‘బ్యాండ్‌ మేళం’ నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అలాగే ‘తిప్పూ కుంటున్నావ్‌...’ అనే మాస్‌ పెప్పీ సాంగ్, ‘పల్లెలోని సందల్లన్ని మీవే...’ అనే మెలోడీ సాంగ్‌ కూడా సినిమా పట్ల అంచనాల్ని పెంచాయి’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌.

Advertisement
 
Advertisement
Advertisement