విజయ్- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ ప్రేమజంట ఉదయ్‌పూర్ వేదికగా ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సందడి చేశారు. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను విజయ్, రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయితే పెళ్లి తర్వాత విరోష్ జోడీ టాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించింది. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు యంగ్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.
స్టార్స్ డుమ్మా..
అయితే కొందరు స్టార్స్ ఈ రిసెప్షన్ వేడుకకు డుమ్మా కొట్టడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ, రామ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నితిన్, కిరణ్ అబ్బవరం ఈ రిసెప్షన్‌లో ఎక్కడా కూడా కనిపించలేదు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు పెద్దగా బాండింగ్ లేకపోవడం వల్లే రాదని తెలుస్తోంది. మరోవైపు హీరో నితిన్ అందుబాటులో లేనని కొత్త జంటకు ముందే చెప్పినట్లు సమాచారం.
అదే కారణమా?
కొందరు టాలీవుడ్ స్టార్స్ విరోష్ రిసెప్షన్‌కు హాజరు కాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విజయ్- రష్మిక స్వయంగా వెళ్లి ఆహ్వానించకోవపోవడమే కారణమని తెలుస్తోంది. పీఆర్ ఎజెన్సీ ద్వారా ఆహ్వానాలు పంపడం వల్లే కొందరు రాలేదని టాక్ వినిపిస్తోంది. పర్సనల్‌గా ఆహ్వానించలేదనే అసంతృప్తితోనే ఈ వేడుకలో పాల్గొనలేదని తెలుస్తోంది. ఏదేమైనా టాలీవుడ్ స్టార్స్ ఈ రిసెప్షన్‌కు రాకపోవడం సినీ ప్రియుల్లో చర్చకు దారితీసింది.


