ఇంటికెళ్లి విరోష్ జంటను కలిసిన సీఎం | Telangana CM Revanth Reddy Visits Tollywood Hero Vijay Devarakonda Home, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Vijay Deverakonda: ఇంటికెళ్లి విరోష్ జంటను కలిసిన సీఎం

Mar 6 2026 12:15 AM | Updated on Mar 6 2026 11:49 AM

Telangana CM Revanth Reddy visitsTollywood hero Vijay devarakonda home

విరోష్ జంటను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు. హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను విజయ్ దేవరకొండ ట్విటర్‌లో షేర్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి ఆశీర్వదించడం మా హృదయాన్ని కదిలించిందని విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు. మాపై ఆయన చూపించే ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా.. టాలీవుడ్‌ లవ్ బర్డ్స్ విజయ్- రష్మిక గతనెల 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. పెళ్లి తర్వాత ఈనెల 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించారు. ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement