శరవణన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘లీడర్’. పాయల్ రాజ్‌పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. లెజెండ్ శరవణ స్టోర్స్‌ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్‌ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘నా కూతురితో పాటే నేనుండాలి. దాని కోసం ఈ ప్రపంచాన్నే ఎదరించమన్నా ఎదిరించి గెలుస్తాను’ వంటి సంభాషణలు టీజర్‌లో ఉన్నాయి. ‘‘తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే శక్తివేల్ పాత్రలో శరవణన్ నటించారు. మాస్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆలరించేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది.


