ఓటీటీలో జెన్‌జీ లవ్‌స్టోరీ.. స్ట్రీమింగ్‌పై ప్రకటన | Bookie movie ott streaming date locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో జెన్‌జీ లవ్‌స్టోరీ.. స్ట్రీమింగ్‌పై ప్రకటన

Mar 5 2026 8:44 PM | Updated on Mar 5 2026 8:48 PM

Bookie movie ott streaming date locked

కోలీవుడ్‌ హీరో విజయ్‌ ఆంటోనీ మేనల్లుడు అజయ్‌ ధీషన్ హీరోగా నటించిన చిత్రం 'బూకి'.. ఫిబ్రవరి 20న విడుదలైన  ఈ చిత్రం కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. గణేష్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని విజయ్‌ ఆంటోనీ సమర్పణలో శర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ధనుషా హీరోయిన్‌గా నటించగా సునీల్, లక్ష్మి మంచు కీలకపాత్రల్లో మెప్పించారు.

రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బూకి' (Bookie) చిత్రం.. మార్చి 13న జీ5 (Zee 5) నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.   తమిళ్‌ వర్షన్‌లో అందుబాటులో ఉండనుందని ప్రకటించింది. అయితే, తెలుగు వర్షన్‌ కూడా అదేరోజున విడుదల కావచ్చని సమాచారం. ‘మార్గన్‌’ సినిమాతో నటుడిగా అజయ్‌ ధీషన్ మంచి గుర్తింపు తెచ్చకున్న విషయం తెలిసిందే.  జెన్‌జీ లవ్‌స్టోరీ అంటూ కొందరు ఈ మూవీని ప్రశంసించినా.. మరికొందరు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదని తెలిపారు. మరి ఓటీటీలో ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement