మరో ఓటీటీకి 'లాల్‌ సలామ్‌' .. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Rajinikanth lal Salaam Movie now another ott streaming | Sakshi
Sakshi News home page

మరో ఓటీటీకి 'లాల్‌ సలామ్‌' .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mar 5 2026 5:48 PM | Updated on Mar 5 2026 6:10 PM

Rajinikanth lal Salaam Movie now another ott streaming

తమిళ హీరో రజనీకాంత్‌ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం  'లాల్‌ సలామ్‌'.. 2024 విడుదలైన ఈ మూవీ ఇప్పటికే సన్‌ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, తాజాగా హిందీ వర్షన్‌ ఓటీటీలోకి వచ్చేసింది.రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటించిగా రజనీకాంత్‌ అతిథి పాత్రలో కనిపించారు.

'లాల్‌ సలామ్‌' మూవీ సన్‌ నెక్ట్స్‌(Sun NXT)లో తెలుగు, తమిళ్‌ వర్షన్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. హిందీ వర్షన్‌ జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఈ క్రమంలో తాజాగా హిందీ వర్షన్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. కానీ, ఈ మూవీని చూడాలంటే అదనంగా రెంట్‌ చెల్లించాల్సి ఉందని పేర్కొనడం విశేషం. ఇప్పటికే ఒక ఓటీటీలో ఉచితంగా చూసే అవకాశం ఉన్న ఈ మూవీకి అదనంగా రెంట్‌ చెల్లించేలా షరతు పెట్టడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సుమారు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ. 52 కోట్లు మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 

కథేంటి..?
'లాల్‌ సలామ్‌' కథ మొత్తం  1990ల కాలం బ్యాక్‌డ్రాప్‌తో నడుస్తోంది.  మొయిదీన్ భాయ్ (రజనీకాంత్) కుమారుడు సంషి (విక్రాంత్), గురు (విష్ణు విశాల్) స్నేహితులు. షంషుద్దీన్‌ (విక్రాంత్‌)ను క్రికెటర్‌ను చేయాలన్నది తండ్రి కల. అనుకున్నట్లు గానే సంషి రాష్ట్ర రంజీ జట్టుకు ఆడటానికి ఎంపికవుతాడు. ఈ క్రమంలో ఆ ఊళ్లో త్రీస్టార్‌ - ఎంసీసీ టీమ్స్‌ మధ్య జరిగే క్రికెట్‌ ఆటతో రెండు మతాల మధ్య గొడవ మొదలౌతుంది. ఆ గొడవలోనే షంషుద్దీన్‌ చేతిని నరికేస్తాడు గురు అలియాస్‌ గురునాథం (విష్ణు విశాల్‌).. దాడి చేసిన గురు కూడా  మొయిదీన్ భాయ్‌కి ప్రాణ స్నేహితుడు అయిన (ఫిలిప్‌ లివింగ్‌స్టోన్‌) కుమారుడు కావడం విశేషం. 

హిందూ ముస్లింలు ఐకమత్యంగా ఉండే ఆ ఊరిలో క్రికెట్‌ వల్ల మత కల్లోలంగా మారుతుంది. ముంబైలో వ్యాపారావేత్తగా రాణిస్తున్న మొయిద్దీన్‌  అ గ్రామానికి తిరిగొస్తాడు. కుమారుడి చేయి నరికిన స్నేహితుడి కుటుంబాన్ని మొయిదీన్ ఏం చేస్తాడు..? క్రికెట్‌లో గొడవలకు కారణం ఏంటి..? సంషి, గురు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు ఎలా మొదలైంది..? తన కొడుకు చేయి నరికిన గురును మొయిద్దీన్‌ ఏం చేశాడు..? అనేది తెలియాలంటే జూన్‌ 6న సన్‌ నెక్ట్స్‌లో లాల్‌ సలామ్‌ చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement