నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ హనీ. ఈసినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 6న విడుదలైన థియేటర్లలో ఫర్వాలేదనిపించింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈనెల 27 నుంచి సన్ నెక్ట్స్‌లో ప్రసారం కానుందని వెల్లడించారు.
తాజాగా మరో ఓటీటీలోనూ హనీ సందడి చేయనుందని నవీన్‌చంద్ర తెలిపారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. దీంతో ఓకే రోజు రెండు ఓటీటీల్లో హనీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. కాగా.. క్షుద్రపూజలు, చేతబడులు అనే కాన్సెప్ట్‌తో పాటు డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో దివ్యా పిళ్లై, దివి, రాజా రవ్రీంద కీలక పాత్రలలో కనిపించారు.
Hi Nenu Mee Naveen Chandra..Ela Unnaru? naaku Telusu Meeru Naa Nundi Maro Exciting & Thrilling Movie Kosam Waiting Ani.. Andhuke Ippatidhaka Meeru Experience Cheyani Movie Ni Meeku Chupinchabothunam..27th Feb Nundi..Mee Amazon Prime Lo..Get Ready 🔴 🐈⬛ #HoneyMovie Will Stream… pic.twitter.com/qBjf3CgjS9
— Actor Naveen Chandra (@Naveenc212) February 25, 2026


