దురంధర్ మూవీతో రణ్‌వీర్ సింగ్ బాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. ఛావా, కాంతార-2 చిత్రాల వసూళ్లను అధిగమించింది. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాపై కొందరు విమర్శలు చేశారు. దీనిపై ప్రాపగండా చిత్రమని ముద్రవేశారు.
తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా మాట్లాడారు. దురంధర్ ఓ మాస్టర్ పీస్ అంటూ ప్రశంసలు కురిపించారు. చాలా అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారని కొనియాడారు. సాంకేతికత పరంగానూ ప్రేక్షకులను మెప్పించిందన్నారు. బ్యాంకాక్, థాయిలాండ్‌లో చాలా వాస్తవిక పద్ధతిలో రూపొందించారని అన్నారు. అద్భుతమైన టాలెంట్ ఉన్న ఏకైక వ్యక్తి రణ్‌వీర్ సింగ్ అని అభివర్ణించారు. ఈ సినిమాను ఒక సంపూర్ణ కళాఖండమని అభివర్ణించారు. ఇందులో ఎలా ప్రాపగండా లేదని.. సినిమాను సినిమాగానే చూడాలని శతృఘ్న సిన్హా సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాగా.. ధురంధర్ మూవీలో రణ్‌వీర్ సింగ్ హంజా అలీ మజారి పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణవీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్‌గా మెప్పించారు. ప్రస్తుతం ధురంధర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Wow! Just happened to see the most talked about film an absolute masterpiece
'Dhurandhar'. What 'propaganda' film??? A film is a film is a film. It's a great film, gripping interesting & full of entertainment, made with sincerity. The sets too have been created beautifully in…— Shatrughan Sinha (@ShatruganSinha) February 25, 2026


