దర్శకుడు మారుతి 'హ్యాపీ పొంగల్'? | Director Maruthi Works On Happy Pongal Movie | Sakshi
Sakshi News home page

Director Maruthi: వచ్చే సంక్రాంతికి మారుతి నుంచి మరో సినిమా?

Feb 25 2026 3:56 PM | Updated on Feb 25 2026 5:09 PM

Director Maruthi Works On Happy Pongal Movie

ఈ ఏడాది సంక్రాంతికి 'రాజాసాబ్' సినిమాతో వచ్చిన దర్శకుడు మారుతి.. ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. విడుదలకు ముందు ఇంటి అడ్రస్ కూడా చెప్పేసరికి.. ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయ్యారు. తీరా మూవీ చూసి పూర్తిగా డిసప్పాయింట్ అ‍య్యారు. సోషల్ మీడియాలో మారుతిపై ఘోరంగా ట్రోల్స్, విమర్శలు చేశారు. దీంతో ఈ దర్శకుడి నుంచి తర్వాత మూవీ ఏం వస్తుందా అనే రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు దానికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: అన్వేష్‌కి బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు)

'రాజాసాబ్' ఫ్లాప్ అయినప్పటికీ మారుతి.. మెగాహీరోతో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని కొన్నిరోజుల క్రితం రూమర్ వినిపించింది. వరుణ్ తేజ్‌తో ఇది ఉండొచ్చని అన్నారు. హీరో రామ్ పేరు కూడా వినిపించింది గానీ ఇవి ఫేక్ అని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ఏకంగా మూవీ టైటిల్ కూడా బయటకొచ్చింది. 'హ్యాపీ పొంగల్' పేరుతో మారుతి.. ఓ కామెడీ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని, దీనికి తగ్గ హీరోని వెతికే పనిలో ప్రస్తుతం ఉన్నారని టాక్ వినిపిస్తుంది. టైటిల్‪‌కి తగ్గట్లే వచ్చే సంక్రాంతికి దీన్ని థియేటర్లలోకి తీసుకొస్తారేమో చూడాలి?

మరోవైపు 'రాజాసాబ్' ఫెయిలైనప్పటికీ హీరో ప్రభాస్, మారుతికి భరోసా ఇచ్చారట. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. మీడియం రేంజ్ హీరోలతో ఓ మాదిరి కామెడీ సినిమాలు తీసిన మారుతి.. పర్లేదనిపించే పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే 'రాజాసాబ్' చేశాడో అటు సమయం, ఇటు సినిమా రెండు కోల్పోయాడు. ఇప్పుడు మళ్లీ తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్‌లోనే ఓ మిడ్ రేంజ్ హీరోతో మూవీ చేసి కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే)

Advertisement
 
Advertisement
Advertisement