పెళ్లి వేడుకలో వరుణ్‌- లావణ్య.. ఎక్కడంటే? | Varun Tej And Lavanya Tripathi Attend Wedding With Son Vaayuv, Photo Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

లావణ్య ఇంట పెళ్లి సందడి.. కొడుకును ఆడిస్తున్న వరుణ్‌!

Feb 25 2026 3:08 PM | Updated on Feb 25 2026 3:57 PM

Varun Tej, Lavanya Tripathi Attend Wedding with Son Vaayuv

టాలీవుడ్‌ స్టార్‌ జంట వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి పెళ్లి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అయితే మీరనుకున్నట్లు విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నాల పెళ్లి వేడుకలో కాదు, లావణ్య సోదరుడు సిద్దాంత్‌ వివాహ వేడుకలో అని తెలుస్తోంది. కుమారుడు వాయువ్‌తో కలిసి వరుణ్‌- లావణ్య ఈ శుభకార్యంలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ
ఈ పెళ్లి డెహ్రాడూన్‌లో జరిగినట్లు తెలుస్తోంది. అటు నిహారిక సైతం మెహందీ సెలబ్రేషన్స్‌ అంటూ చేతులకు చందమామ పెట్టుకున్న ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆ తర్వాత మేనల్లుడిని జాగ్రత్తగా చూసుకుంటున్న వీడియో షేర్‌ చేసింది. ఇదంతా చూస్తుంటే ఇది లావణ్య ఇంటి ఫంక్షన్‌లాగే అనిపిస్తోంది.

సినిమా
సినిమాల విషయానికి వస్తే.. వరుస అపజయాలతో సతమతమవుతున్న వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం కొరియన్‌ కనకరాజు మూవీ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితికా నాయక్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ హారర్‌ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement