డ్రైవింగ్‌ చేస్తూ నిద్ర పోతున్నాడు: హీరోయిన్‌ | Meera Chopra Recalls Unfortunate Experience: Driver came dirty with stinking car | Sakshi
Sakshi News home page

Meera Chopra: హీరోయిన్‌కు చేదు అనుభవం.. కారు బుక్‌ చేసుకున్న కాసేపటికే..

Feb 25 2026 1:00 PM | Updated on Feb 25 2026 1:05 PM

Meera Chopra Recalls Unfortunate Experience: Driver came dirty with stinking car

హీరోయిన్‌ మీరా చోప్రాకు చేదు అనుభవం ఎదురైంది. క్షేమంగా, వేగంగా వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకుంటే డ్రైవర్‌ ప్రవర్తనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నానని చెప్తోంది. ఈ చేదు అనుభవాన్ని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది. ఉబర్‌ క్యాబ్‌ వల్ల నేను భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాను. మంగళవారం ఉదయం ఆరుగంటల కోసం కారు బుక్‌ చేసుకున్నాను. తీరా దుమ్ము, మురికి పట్టిన కారు వచ్చింది. డ్రైవర్‌ కూడా అంతే డర్టీగా ఉన్నాడు. కారు ఎందుకింత మురికిగా ఉందని డ్రైవర్‌ను అడిగాను. 

నిద్రపోతూ డ్రైవింగ్‌
కానీ, అతడు సమాధానం చెప్పే స్థితిలో లేడు. కారు నడుపుతూనే నిద్రపోతున్నాడు. 20 నిమిషాల్లో ఆ క్యాబ్‌ దిగిపోయి మరొకటి బుక్‌ చేసుకున్నాను. కానీ ఉబర్‌ మాత్రం నా నుంచి 6 గంటల ఫీజు వసూలు చేసింది. ప్రయాణికుల భద్రతను మాత్రం గాలికొదిలేసింది. కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే వారి పని.. ఇదెంత అసహ్యకరం అని ట్వీట్‌ చేసింది. దీంతో చాలామంది నెటిజన్లు తమకూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయంటూ వారి అనుభవాలు షేర్‌ చేసుకున్నారు.

సినిమా
మీరా చోప్రా విషయానికి వస్తే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వాన, గ్రీకువీరుడు, మారో వంటి చిత్రాల్లో నటించింది. గ్యాంగ్‌ ఆఫ్‌ ఘోస్ట్స్‌ మూవీ ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ద టాటూ మర్డర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది.

 

 

చదవండి: ఎంత సంపాదించినా ఇప్పుడే.. లేదంటే: తమన్నా

Advertisement
 
Advertisement
Advertisement