'ఆయా షేర్' పాట.. నా స్టెప్ కాపీ కొట్టేశారు | Aaya Sher Song Hook Step Copy Allegations | Sakshi
Sakshi News home page

Aaya Sher Song: 'ఆయా షేర్' హుక్ స్టెప్.. ఒరిజినల్ నాదే అని యూట్యూబర్

Feb 25 2026 11:21 AM | Updated on Feb 25 2026 12:00 PM

Aaya Sher Song Hook Step Copy Allegations

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల.. 'ఆయా షేర్' పాట వింటూ చిల్ అయిపోతున్నారు. నాని హీరోగా నటిస్తున్న 'ప్యారడైజ్' సినిమాలోని పాట ఇది. అనిరుధ్ సంగీతమందించాడు. నాని పుట్టినరోజు సందర్భంగా మంగళవారం సాయంత్రం దీన్ని రిలీజ్ చేయగా.. వెంటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. మ్యూజిక్, బీట్, లిరిక్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. ఓ యూట్యూబ్ మాత్రం ఇందులో నాని వేసిన హుక్ స్టెప్ నాదే అని, కాపీ కొట్టేశారని అంటున్నాడు.

(ఇదీ చదవండి: పవన్‌ని టార్గెట్ చేస్తూ పూనమ్ సంచలన ట్వీట్)

హైదరాబాద్‌లో బాబా జాక్సన్ పేరుతో ఉన్న ఓ ఇన్ఫ్లూయెన్సర్.. ఇన్ స్టా, యూట్యూబ్‌లో డాన్స్ వీడియోలతో బాగానే ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. గతంలో ఇతడు ఓ విదేశీయుడితో కలిసి వేసిన స్టెప్‌నే ఇప్పుడు 'ఆయా షేర్' పాటలో కాపీ కొట్టేశారని అంటున్నారు. ఈ మేరకు తన ఇన్ స్టాలో సదరు ఇన్ఫ్లూయెన్సర్.. ఒరిజినల్ ఇదే అంటూ రెండు వీడియోలు కూడా పోస్ట్ చేశాడు.

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ద ప్యారడైజ్'. పీరియాడిక్ యాక్షన్ మూవీ ఇది. మోహన్ బాబు విలన్ కాగా.. బాలీవుడ్ నటుడు రాఘవ్ జ్యూయెల్ కీలక పాత్ర చేస్తున్నాడు. కాయదు లోహర్ హీరోయిన్. తొలుత మార్చి 26నే థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు కానీ షూటింగ్ ఆలస్యం కారణంగా ఆగస్టు 21కి వాయిదా వేశారు. కొన్నిరోజుల క్రితమే అధికారికంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసి కొత్త విడుదల తేదీని ప్రకటించారు. తాజాగా తొలి గీతం వదిలి, అమాంతం హైప్ సొంతం చేసుకున్నారు.

(ఇదీ చదవండి: విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని)

Advertisement
 
Advertisement
Advertisement