breaking news
Hook Steps
-
'ఆయా షేర్' పాట.. నా స్టెప్ కాపీ కొట్టేశారు
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల.. 'ఆయా షేర్' పాట వింటూ చిల్ అయిపోతున్నారు. నాని హీరోగా నటిస్తున్న 'ప్యారడైజ్' సినిమాలోని పాట ఇది. అనిరుధ్ సంగీతమందించాడు. నాని పుట్టినరోజు సందర్భంగా మంగళవారం సాయంత్రం దీన్ని రిలీజ్ చేయగా.. వెంటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. మ్యూజిక్, బీట్, లిరిక్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. ఓ యూట్యూబ్ మాత్రం ఇందులో నాని వేసిన హుక్ స్టెప్ నాదే అని, కాపీ కొట్టేశారని అంటున్నాడు.(ఇదీ చదవండి: పవన్‌ని టార్గెట్ చేస్తూ పూనమ్ సంచలన ట్వీట్)హైదరాబాద్‌లో బాబా జాక్సన్ పేరుతో ఉన్న ఓ ఇన్ఫ్లూయెన్సర్.. ఇన్ స్టా, యూట్యూబ్‌లో డాన్స్ వీడియోలతో బాగానే ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. గతంలో ఇతడు ఓ విదేశీయుడితో కలిసి వేసిన స్టెప్నే ఇప్పుడు 'ఆయా షేర్' పాటలో కాపీ కొట్టేశారని అంటున్నారు. ఈ మేరకు తన ఇన్ స్టాలో సదరు ఇన్ఫ్లూయెన్సర్.. ఒరిజినల్ ఇదే అంటూ రెండు వీడియోలు కూడా పోస్ట్ చేశాడు.నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ద ప్యారడైజ్'. పీరియాడిక్ యాక్షన్ మూవీ ఇది. మోహన్ బాబు విలన్ కాగా.. బాలీవుడ్ నటుడు రాఘవ్ జ్యూయెల్ కీలక పాత్ర చేస్తున్నాడు. కాయదు లోహర్ హీరోయిన్. తొలుత మార్చి 26నే థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు కానీ షూటింగ్ ఆలస్యం కారణంగా ఆగస్టు 21కి వాయిదా వేశారు. కొన్నిరోజుల క్రితమే అధికారికంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసి కొత్త విడుదల తేదీని ప్రకటించారు. తాజాగా తొలి గీతం వదిలి, అమాంతం హైప్ సొంతం చేసుకున్నారు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని) View this post on Instagram A post shared by Baba Jackson (@babajackson2019) -
'చికిరి చికిరి' బ్యాట్ స్టెప్ ఐడియా రామ్చరణ్దా?
గతేడాది బాగా హిట్టయిన సాంగ్స్‌లో 'చికిరి చికిరి' ఒకటి. ఇందులో రామ్‌చరణ్ డ్యాన్స్ స్టెప్స్ బాగా వైరలయ్యాయి. ఆ పాట రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ హుక్ స్టిప్ క్రేయేట్ చేసిన వీడియోలే దర్శనమిచ్చాయి. సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చిన ఈ పాటను ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేయగా మోహిత్ చౌహాన్ ఆలపించాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.కంపోజ్ ఎవరు చేశారంటే?తాజాగా జానీ మాస్టర్ ఓ డ్యాన్స్ షోలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. కూర్చుని లేసే స్టెప్స్ తాను కంపోజ్ చేశానని.. కానీ, క్రికెట్ బ్యాట్ స్టెప్ మాత్రం చరణ్ కంపోజ్ చేశాడని తెలిపాడు. జానీ మాట్లాడుతూ.. హుక్ స్టెప్ చరణ్ అన్న వేరేలా కంపోజ్ చేశారు. బ్యాట్ స్టెప్, దాన్ని పట్టుకునేముందు వచ్చే డ్యాన్స్ స్టెప్ ఆయనే క్రియేట్ చేశారు. ఏరోజూ ఆయన క్రెడిట్ తీసుకోరు, మనకే ఇచ్చేస్తారు. సినిమాఎందుకలా అని అడిగితే.. ఐడియా నాది, కానీ దాన్ని ఇంకాస్త బెటర్‌గా మార్చి.. ఇది వర్కవుట్ అవుతుందని నమ్మినందుకు ఆ క్రెడిట్ మీకే చెందాలి అన్నారు. రామ్‌చరణ్ విషయానికి వస్తే.. ఆయన చివరగా నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం పెద్ది అనే స్పోర్ట్స్ డ్రామా మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. చదవండి: రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు -
చిరు సూపర్ డ్యాన్స్.. 'హుక్ స్టెప్' వీడియో సాంగ్ రిలీజ్
చిరంజీవి 'మన శంకరవరప్రసాద్' సినిమాలో బాగా వైరల్ అయిన పాట హుక్ స్టెప్. చిరంజీవి వింటేజ్ స్టెప్పులతో కొరియోగ్రాఫీ చేసిన ఈ సాంగ్.. మూవీ రిలీజ్‌కి ముందు నుంచే తెగ ట్రెండ్ అయిపోయింది. థియేటర్లలోనూ ఇది వస్తున్న జనాలు బాగానే ఎంజాయ్ చేశారు. అలాంటి పాట ఫుల్ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో రిలీజైంది.(ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)ఇందులో చిరు డ్యాన్స్‌లని ఆట సందీప్, జ్యోతి కలిసి కొరియోగ్రాఫీ చేశారు. వీటికి మంచి ప్రశంసలు కూడా లభించాయి. సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైనే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సంతోషంతోనే కొన్నిరోజుల క్రితం దర్శకుడు అనిల్ రావిపూడికి లగ్జరీ రేంజ్ రేవర్ కారుని కూడా చిరంజీవి బహుమతిగా ఇచ్చారు. ఇదే మూవీలో చిరుతో పాటు విక్టరీ వెంకటేశ్ కూడా నటించడం విశేషం.(ఇదీ చదవండి: టాలీవుడ్ జనవరి రిపోర్ట్ కార్డ్.. పైచేయి ఎవరిది?) -
'హుక్ స్టెప్' అలా పుట్టింది: కొరియోగ్రాఫర్ ఆట సందీప్
ఈసారి సంక్రాంతి రిలీజైన సినిమాల్లో చిరంజీవి 'మన శంకర వరప్రసాద్' సక్సెస్ అందుకుంది. కంటెంట్ పరంగా కొత్తగా ఏం లేనప్పటికీ.. కుటుంబ ప్రేక్షకులకు దీన్ని చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపించారు. దీంతో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చాయని మూవీ టీమ్ ప్రకటించారు. ఇందులో ప్రధానంగా చిరు వేసిన 'హుక్ స్టెప్' సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఆ స్టెప్ ఎలా పుట్టిందో కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాస్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఆ రికార్డ్ ఇకపై చిరంజీవి సొంతం!)'రేపు పాట షూటింగ్. ఇంకా హుక్ స్టెప్ కంపోజ్ చేస్తున్నాను. స్టెప్ రావట్లేదు. ఒకపక్కన ఫోన్ కాల్స్. నిజంగా చెబుతున్న ఆ టైంలో చాలా గందరగోళానికి గురయ్యా. భయం ఏంటంటే చిరంజీవితో సాంగ్ చేస్తున్నా. మరోవైపు వాళ్లు వీళ్లు ఊరికే ఫోన్ చేస్తున్నారు. నా భయం ఏంటంటే చిరంజీవి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందా? లేదంటే ఓ కాస్ట్యూమర్ చేస్తున్నాడా? డ్యాన్సర్స్ కోసం చేస్తున్నారా? లేదంటే ప్రాపర్టీస్ కోసం చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు. ఊరికే ఫోన్స్ వస్తున్నాయి. ఇంకా ఆ టైంలో నా ఫోన్‌ని తీసి నేలకేసి కొడదామనుకున్నా. అప్పటిదాకా రాని స్టెప్.. ఫోన్ పట్టుకోగానే వచ్చింది. అప్పుడు వచ్చిన స్టెప్ ఏదైతే ఉందో.. అదే హుక్ స్టెప్. నేను కంపోజ్ చేయడం ఒకత్తెయితే.. కూరకు ఉప్పు, మసాలా, కారం జోడించినట్లు చిరంజీవి గ్రేస్ కలిపారు' అని సందీప్ మాస్టర్ చెప్పాడు.దాదాపు 15-20 ఏళ్ల క్రితం డ్యాన్స్ షోలతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. తోటి డ్యాన్సర్ జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి హైదరాబాద్‌లోనే డ్యాన్స్ స్కూల్స్ కూడా రన్ చేస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత తనకు చిరంజీవితో పనిచేసే అవకాశమొచ్చిందని ఆట సందీప్ రీసెంట్ టైంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. చూడటానికి సింపుల్‌గా అనిపించే ఈ స్టెప్.. అటు ఫ్యామిలీ ఆడియెన్స్, ఇటు కుర్రాళ్లకు బాగానే నచ్చేసిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: సిరై రివ్యూ: ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఉండేది ఇలానే) -
మెగా ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న హుక్ స్టెప్ సాంగ్
-
చిరంజీవి హుక్ స్టెప్, బాలీవుడ్‌లోనూ టాప్!
ఇప్పుడు తెలుగు ప్రేక్షక సమూహం హుషారుగా హుక్ స్టెప్పులేస్తోంది. మెగా నృత్యాల హోరును అనుసరిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు గా తమని పలకరించేందుకు హుక్ స్టెప్పులు వేసుకుంటూ వస్తుండడంతో తెలుగు నాట హుక్ స్టెప్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మరి ఇంతకీ ఈ హుక్ స్టెప్ ఏమిటి? దీనికి మన దేశంలో పాప్యులారిటీ ఎలా పెరిగింది?‘హుక్ స్టెప్ గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే ఓ నృత్యం.. సులభంగా కనిపించాలి. అందరూ నేర్చుకునేలా ప్రేరేపించాలి ‘ అని బాలీవుడ్లో తౌబా తౌబా అనే పాటకు నృత్యంతో వైరల్ అయి సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ చెబుతున్నాడు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నర్తించిన బ్యాడ్ న్యూజ్లోని తౌబా తౌబా పాట స్టెప్స్ ‘ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నించారని ఆయన గుర్తు చేస్తారు. ఆ పాట హిట్‌తో‘ హుక్ స్టెప్‌ను కొరియోగ్రాఫ్ చేయడం ఇప్పుడు తన నృత్య ప్రక్రియలో ఒక భాగమైందని ఆయన చెప్పాడు.పెరిగిన కొరియోగ్రాఫర్ ప్రాధాన్యత...‘హుక్ స్టెప్ కు పెరుగుతున్న ప్రజాదరణ కొరియోగ్రాఫర్లను మరింత పాప్యులర్ చేసింది. హుక్ స్టెప్ గొప్పతనం ఏమిటంటే దాని చుట్టూ అల్లుకునే సందడిలో స్టార్ మాత్రమే కాదు కొరియోగ్రాఫర్ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తారని అది తమకు చాలా ఉపయుక్తమైన అంశమని కొరియోగ్రాఫర్లు అంటున్నారు. నృత్యం అత్యంత ప్రజాదరణ పొందాడానికి దోహదపడేది సౌలభ్యం మాత్రమే ‘ప్రతి వ్యక్తి పుట్టుకతోనే డ్యాన్సర్ కాదు. మైఖేల్ జాక్సన్ లేదా ప్రభుదేవా లాగా అందరూ నృత్యం చేయలేరు. అవి ప్రజలు చూసి బాగున్నాయంటారు. కానీ అవి సులభమైనవైతే అవి మరింత హిట్ కావడం తధ్యం ఎందుకంటే వాటిని అనుసరించడం సులభం అని వారు భావిస్తారు అలాంటివే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి‘‘ నేను పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు, ప్రభుదేవా లాంటి డ్యాన్స్‌లు అందివ్వాలని అనుకున్నా కానీ ఆ తర్వాత పరిస్థితులు భిన్నంగా మారాయని బోస్కో చెప్పాడు. ‘నువ్వు ఎందుకు అంత కష్టతరమైన పని చేయమని చెబుతున్నావు? దానికన్నా సులభమైన స్టెప్పులు ఎందుకు చేయించకూడదు‘ అని చాలా మంది తనతో అన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు.హుక్...హిస్టరీ...దీని గురించి బాలీవుడ్ మరో కొరియోగ్రాఫర్ ముదస్సర్ ఖాన్ మాట్లాడుతూ, హుక్ స్టెప్పు ప్రజాదరణ ‘సల్మాన్ ఖాన్, గోవింద మాధురీ దీక్షిత్ వంటి నటులతో ప్రారంభమైందన్నాడు. వారికి వారికంటూ స్వంత ప్రత్యేకమైన నృత్య శైలులు ఉన్నాయి‘ అని చెప్పారు. వారి నృత్యాలు పాప్యులర్ అవడానికి కారణం గుర్తించిన దగ్గర నుంచీ తాను తన కొరియోగ్రఫీ వర్క్‌లో హుక్ స్టెప్పును కూడా చేర్చుకున్నానని ఖాన్ చెప్పాడు.‘నేను సల్మాన్ ఖాన్‌కు మొదటిసారి కొరియోగ్రఫీ సీక్వెన్స్ చూపించడానికి వెళ్ళినప్పుడు, ఆయన కష్టమైన నృత్యాలను ఇష్టపడతాడని అనుకున్నాను. కానీ ఆయనకు హుక్ స్టెప్పు అన్నింటికంటే నచ్చింది.‘ అంటూ గుర్తు చేసుకున్నారాయన. ఒక సన్నివేశాన్ని కొరియోగ్రఫీ చేయడంతో పాటు వైరల్‌గా మార్చడం కూడా ఇప్పుడు తమ పనిలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందని ఖాన్ అన్నారు. హుక్ స్టెప్‌ను రూపొందించడానికి ఏదైనా ఫార్ములా ఉందా అని అడిగితే.... ‘‘ తల గోకడం నుంచీ షూలేసులు కట్టుకోవడం దాకా బెల్ట్ బిగించడం నుంచి కర్టెన్లు సరిచేయడం దాకా...ప్రజలు తమ దైనందిన జీవితంలో చేసే రొటీన్ పనులనే సంగీతంతో కూడిన నృత్యంగా మార్చగలిగితే అదే హుక్ స్టెప్’’ అన్నారాయన. ‘‘సంగీతం కూడా హుక్ స్టెప్ కు థీటుగా ఆకర్షణీయంగా ఉండాలి. సంగీతం యావరేజ్‌గా ఉంటే, ఎంత మంచి హుక్ స్టెప్ వేసినా, అది ఆకర్షణీయంగా మారదు. సంగీతం కొరియోగ్రఫీతో కలిసిపోవడం వల్లనే హుక్ స్టెప్ ప్రజాదరణ పొందుతుంది అని అభిప్రాయపడ్డారు.హుక్ స్టెప్లు దశాబ్దాల క్రితమే ప్రాచుర్యం పొందినప్పటికీ, ఇప్పుడు వాటి శైలి, అవసరం చాలా మారిపోయిందని కొరియోగ్రాఫర్ పునీత్ జె పాఠక్ చెప్పారు. ‘‘గతంలో పెద్దా చిన్నా తేడా లేకుండా వేడుకలలో నృత్యం చేయగలిగే లాంటి హుక్ స్టెప్‌ను తయారు చేయండి’ అని అడిగేవారు అయితే ఇప్పుడు ఇన్ స్ట్రాగామ్‌లో, రీల్స్‌లో ఉంచే హుక్ స్టెప్‌ను తయారు చేసి దానిని వైరల్ చేయడం ముఖ్యంగా మారిందని అన్నారాయన. గతంలో ఇది ప్రేక్షకుల ఇళ్లకు చేరుకోవడం గురించిన ఆలోచన ఉండేది అయితే ఇప్పుడు వారి ఫోన్లను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది అంటూ పేర్కొన్నారు.అయితే రీల్స్ ఆధారిత హుక్ స్టెప్స్ డ్యాన్స్ సీక్వెన్స్‌ల వైరల్లో ఉన్న సమస్య వైరల్ అనేది స్వల్ప కాలానికే పరిమితం కావడం అని పాథక్ అన్నారు. ‘గతంలో ’తౌబా తౌబా’ వైరల్ అయింది. దానికి వారం క్రితం ఇంకేదో వైరలైంది. అయితే స్టెప్స్ వైరల్ అవుతున్నాయి కానీ ఐకానిక్‌గా ఉండడం లేదు‘ అని ఆయన అభిప్రాయపడ్డారు.‘హుక్ స్టెప్ సవాళ్లలో పాల్గొనడానికి ఇష్టపడతాను అవి సరదాగా ఉంటాయి, అవి నా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి నాకు సహాయపడతాయి నా డ్యాన్స్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశం ఇస్తాయి. ‘అంతేకాకుండా, అవి నాకు ట్రెండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, తాజా సోషల్ మీడియా సందడిలో నన్ను భాగంగా మారుస్తాయి’’ అని కంటెంట్ క్రియేటర్ వృషికా మెహతా చెప్పింది. ఒక ఇన్ ఫ్లుయెన్సర్‌గా, తాను ఈ హుక్ స్టెప్లను ప్రదర్శించడం ద్వారా సినిమాలను ప్రమోట్ చేస్తాననీ వాటిని నా ప్రేక్షకులతో పంచుకుని వారిని కూడా పాల్గొనమని ప్రోత్సహిస్తానని ఆమె వివరించింది.ఇటీవలి కాలంలో కొన్ని హుక్ హిట్స్...ఈ మధ్య కాలంలో వైరల్ అయిన హుక్ స్టెప్స్‌లో జాదు‘ (జ్యుయల్ థీఫ్) పాటలో జైదీప్ అహ్లావత్ చేసిన నృత్యం, అలాగే ‘తౌబా తౌబా‘ (బాడ్ న్యూజ్): విక్కీ కౌశల్ మూవ్ మెంట్స్ , ‘జనాబ్–ఎ–ఆలీ‘ (వార్ 2) చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో హృతిక్ రోషన్ వేసిన స్టెప్పులు అత్యంత ప్రజాదరణ పొందాయి. అలాగే ‘పెహ్లా తు దుజా తు‘ ( సన్ ఆఫ్ సర్దార్ 2) పాటలో అజయ్ దేవగన్ స్టైల్ వైరల్ కాగా,‘ఝూమ్ షరాబీ‘ (దే దే ప్యార్ దే 2)లో కూడా అజయ్ దేవగన్ మళ్లీ గ్లాస్‌తో వైరల్ స్టెప్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఇదే కోవలో ‘హుక్ స్టెప్‘ (మన శంకర వరప్రసాద్ గారు): చిరంజీవి స్టెప్స్ తోడయ్యాయి.


