గతేడాది బాగా హిట్టయిన సాంగ్స్‌లో 'చికిరి చికిరి' ఒకటి. ఇందులో రామ్‌చరణ్ డ్యాన్స్ స్టెప్స్ బాగా వైరలయ్యాయి. ఆ పాట రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ హుక్ స్టిప్ క్రేయేట్ చేసిన వీడియోలే దర్శనమిచ్చాయి. సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చిన ఈ పాటను ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేయగా మోహిత్ చౌహాన్ ఆలపించాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.
కంపోజ్ ఎవరు చేశారంటే?
తాజాగా జానీ మాస్టర్ ఓ డ్యాన్స్ షోలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. కూర్చుని లేసే స్టెప్స్ తాను కంపోజ్ చేశానని.. కానీ, క్రికెట్ బ్యాట్ స్టెప్ మాత్రం చరణ్ కంపోజ్ చేశాడని తెలిపాడు. జానీ మాట్లాడుతూ.. హుక్ స్టెప్ చరణ్ అన్న వేరేలా కంపోజ్ చేశారు. బ్యాట్ స్టెప్, దాన్ని పట్టుకునేముందు వచ్చే డ్యాన్స్ స్టెప్ ఆయనే క్రియేట్ చేశారు. ఏరోజూ ఆయన క్రెడిట్ తీసుకోరు, మనకే ఇచ్చేస్తారు.
సినిమా
ఎందుకలా అని అడిగితే.. ఐడియా నాది, కానీ దాన్ని ఇంకాస్త బెటర్‌గా మార్చి.. ఇది వర్కవుట్ అవుతుందని నమ్మినందుకు ఆ క్రెడిట్ మీకే చెందాలి అన్నారు. రామ్‌చరణ్ విషయానికి వస్తే.. ఆయన చివరగా నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం పెద్ది అనే స్పోర్ట్స్ డ్రామా మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.
చదవండి: రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు


