బరువు తగ్గిన కీరవాణి.. బాలీవుడ్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌.. | Keeravani Lose 22 Kilos Bollywood Actor Anupam Kher Shared His Before After Photos | Sakshi
Sakshi News home page

కీరవాణిపై షాకింగ్‌ కామెంట్స్‌

Nov 13 2026 6:37 PM | Updated on Nov 13 2026 6:45 PM

Keeravani Lose 22 Kilos Bollywood Actor Anupam Kher Shared His Before After Photos

ఎంఎం కీరవాణి కోసం ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన తన ఫిట్‌నెస్ ప్రయాణంలో అద్భుతమైన మైలురాయిని అధిగమించారు. ఇదే విషయాన్ని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ శుక్రవారం (నవంబర్ 13) సోషల్‌మీడియా వేదికగా  కొన్ని ప్రత్యేకమైన ఫొటోలను పంచుకుని ఓ సుదీర్ఘమైన నోట్‌ రాశారు. ఇప్పుడీ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

‘మిస్టర్ కీరవాణి.. బిఫోర్ అండ్ ఆఫ్టర్! నా అత్యంత ప్రియమైన మిత్రుడు. ఈ ఆస్కార్ విజేత ఏకంగా 22 కిలోల బరువు తగ్గారు. ఆయన పట్టుదల నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. నా ఈ హైదరాబాద్ పర్యటనలో ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. కీరవాణి ఎంతో ఫ్రెష్‌గా, పూర్తి ఉత్సాహంతో ప్రపంచాన్ని జయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించారు. ఆయన నడకలో ఒక కొత్త ఉత్సాహం కనిపించింది.  కీరవాణి సర్.. మీరు సంగీతంలో ఒక మేధావి. ఇప్పుడు ఏకాగ్రత, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు.  నీ ఈ కొత్త అధ్యాయానికి శుభాకాంక్షలు మిత్రమా’ అని అనుపమ్ ఖేర్ అన్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో రూ.1600 కోట్ల థ్రిల్లర్‌ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement