ఓటీటీలో రూ.1600 కోట్ల థ్రిల్లర్‌ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Hollywood Horror Thriller Movie Obsession Streaming in Telugu also | Sakshi
Sakshi News home page

Thriller Movie: ఓటీటీలో రూ.1600 కోట్ల థ్రిల్లర్‌ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Nov 13 2026 5:43 PM | Updated on Nov 13 2026 5:45 PM

Hollywood Horror Thriller Movie Obsession Streaming in Telugu also

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమాల్లో 'అబ్సెషన్' ఒకటి.  ఈ హాలీవుడ్ థ్రిల్లర్ మూవీని ఓ యూట్యూబర్ తెరకెక్కించారు. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ.1600 కోట్ల కలెక్షన్ సాధించింది.  మొదట అమెరికాలో మాత్రమే రిలీజైన ఈ చిత్రం.. ఆ తర్వాత మన దేశంలోనూ విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.

ఈ మూవీ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మొదట ఈ మూవీ కేవలం ఇంగ్లీష్, హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీంతో సౌత్ ఆడియన్స్‌ కాస్తా నిరాశకు గురయ్యారు. తాజాగా జియో హాట్‌స్టార్ దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.  అంతేకాకుండా అన్ కట్ వర్షన్‌ ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ చిత్రంలో మైఖేల్ జాన్సన్, ఇండే నవారెట్‌లు ప్రధాన పాత్రల్లో నటించగా.. కరీ బార్కర్ దర్శకత్వం వహించారు.

అబ్సెషన్‌ కథేంటంటే..

బేర్ (మైకేల్ జాన్స్‌టన్) కాలేజీ కుర్రాడు. ఓ మ్యూజిక్ షాపులో పనిచేస్తుంటాడు. ఇతడికి ముగ్గురు ఫ్రెండ్స్. వాళ్లలో ఒకరైన నిక్కీని(ఇండే నవరెట్టే) ఇతడు ప్రేమిస్తుంటాడు. కానీ ఆమెకు ఆ విషయం చెప్పేందుకు చాలా భయపడిపోతుంటాడు. ఓ రోజు 'వన్ విష్' పేరుతో ఉన్న చిన్న వస్తువుని కొంటాడు. దాన్ని విరగ్గొట్టి నిక్కీ తనని చాలా ప్రేమించేయాలని బలంగా కోరుకుంటాడు. ఊహించని విధంగా ఆ కోరిక నిజమైపోతుంది. నిక్కీ, బేర్‌ని ప్రేమించడం మొదలుపెడుతుంది. అప్పటివరకు అంతా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement