ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా అనిరుధ్ రవిచందర్- కావ్య మారన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక గ్రీస్‌లో గ్రాండ్‌గా జరిగింది. టాలీవుడ్ హీరో తేజ సజ్జా సైతం పెళ్లికి రెడీ అయిపోయారు. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు.
తాజాగా మరో జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనుంది. కోలీవుడ్‌కు చెందిన సింగర్స్ సామ్ విశాల్, శ్రీనిష ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. చెన్నైలో జరిగిన ఈ నిశ్చితార్థ ఈ వేడుకలో బంధువులు, స్నేహితులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీరి పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు.
కాగా.. ఏడేళ్ల వయసులో సూపర్ సింగర్ షోతో అరంగేట్రం చేసిన శ్రీనిష 'అవన్ ఇవన్' చిత్రంలోని 'ఒరు మలయోరం' పాటతో తమిళ చిత్రసీమలో సింగర్‌గా అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె అనేక చిత్రాలలో ఎన్నో పాటలు పాడింది. సూపర్ సింగర్ షోలో తనతో కలిసి పాడిన సామ్ విశాల్‌తో ఆమె ప్రేమలో పడింది. వారిద్దరూ చాలా ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు.
Popular singers #SamVishal and #Srinisha tied the knot yesterday! ❤️💍 Wishing the newlyweds a lifetime of happiness and togetherness! #SamVishal #Srinisha https://t.co/r0h0hBF6Fa
— Sathish Kumar M (@sathishmsk) November 12, 2026


