చిల్డ్రన్స్ డే ఆఫర్.. ఒక్కో టికెట్‌పై రూ.100 ఆఫర్ | Jayannth and The Jingo Pen Ticket Prices Decreased for Childrens day | Sakshi
Sakshi News home page

Jayannth and The Jingo Pen: చిల్డ్రన్స్ డే ఆఫర్.. ఒక్కో టికెట్‌పై రూ.100 తగ్గింపు

Nov 12 2026 9:15 PM | Updated on Nov 12 2026 9:15 PM

Jayannth and The Jingo Pen Ticket Prices Decreased for Childrens day

మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి కీలక పాత్రల్లో వస్తోన్న మూవీ ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ మూవీలో  సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా పిల్లల కోసం టికెట్ రేట్లు రూ.250 నుంచి రూ.150 తగ్గించారు. ఈ చిత్రానికి నవీన్ దేశబోయిన దర్శకత్వంలో తెరకెక్కించారు. నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించారు.

దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ .. 'జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రాన్ని బాలల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం. ఈ మూవీని వ్యాపారంగా చూడటం లేదు. అందుకే టికెట్ రేట్లను రూ. 150కి తగ్గించాం. పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ ఈ సినిమాని చూడాలి. ఇప్పటికే చాలా స్కూల్స్ థియేటర్లను బుక్ చేసుకున్నాయి. ఈ రోజు కావాలనే ఓ సినిమాని చిల్డ్రెన్స్ డే స్పెషల్ అంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ విషయంలో మీరు పొరబాటు పడకండి. మా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమా నవంబర్ 14న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి' అని అన్నారు.

మాస్టర్ జయంత్ బొలిశెట్టి మాట్లాడుతూ .. 'జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాని చిల్డ్రెన్స్ డే స్పెషల్‌గా రిలీజ్ చేస్తున్నాం. పిల్లల కోసం ఈ మూవీ టికెట్‌ని రూ. 250 నుంచి రూ. 150కి తగ్గించాం. పిల్లలకు, పెద్దలకు, టీచర్లకు మంచి సందేశం ఇచ్చేలా సినిమా ఉంటుంది. మా మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది' అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement