టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ లేటేస్ట్ మూవీ హైందవ. ఈ చిత్రాన్ని డివోషనల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీకి లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.
తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ వీడియో రిలీజ్ చేశారు. ఎవరైనా అంటూ సాగే రొమాంటిక్ పాట విడుదల చేశారు. ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ అందించగా.. కపిల్ కపిలన్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ సాగ్ సామ్ సీఎస్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తి, సౌరభ్ సచ్‌దేవా, మహేష్ మంజ్రేకర్, శివాజీ రాజా, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


