breaking news
Haindava Movie
-
బెల్లంకొండ హైందవ మూవీ.. రిలీజ్ వాయిదా
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ లేటేస్ట్ మూవీ హైందవ. ఈ చిత్రాన్ని డివోషనల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీకి లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ మూవీని నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ముందుగానే ప్రకటించారు.తాజాగా ఈ మూవీ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకుడికి మరింత క్వాలిటీ కంటెంట్ అందించేందుకే వాయిదా వేస్తున్నట్లు నోట్ రిలీజ్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఎల్లప్పుడు మాకు మద్దతుగా నిలుస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. ఈనెల 27న రిలీజవుతున్న అని సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు నోట్లో పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తి, సౌరభ్ సచ్‌దేవా, మహేష్ మంజ్రేకర్, శివాజీ రాజా, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. #HAINDAVA has been postponed from its scheduled date to give you all the best experience with high technical standards 🙏❤️ A new release date will be announced soon. Stay tuned ✨ @BSaiSreenivas @iamsamyuktha_ @MaheshChandu @JDmaxmode @ludheerbyreddy @SamCSmusic @dop_harish https://t.co/IfLZuh6vOy— Moonshine Pictures (@Moonshine_Pctrs) November 20, 2026 -
బెల్లంకొండ హైందవ.. రొమాంటిక్ లవ్ సాంగ్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ లేటేస్ట్ మూవీ హైందవ. ఈ చిత్రాన్ని డివోషనల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీకి లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ వీడియో రిలీజ్ చేశారు. ఎవరైనా అంటూ సాగే రొమాంటిక్ పాట విడుదల చేశారు. ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ అందించగా.. కపిల్ కపిలన్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ సాగ్ సామ్ సీఎస్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తి, సౌరభ్ సచ్‌దేవా, మహేష్ మంజ్రేకర్, శివాజీ రాజా, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
గుడిలో విగ్రహాలు మిస్సింగ్.. 'హైందవ' టీజర్ రిలీజ్
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కాస్త గ్యాప్ తీసుకుని కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అదే 'హైందవ'. దేవుడి కాన్సెప్ట్‌కి థ్రిల్లర్ కథని జోడించి తీశారు. తాజాగా టీజర్ రిలీజ్ చేసిన టీమ్.. మూవీ విడుదల తేదీని కూడా వెల్లడించారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా లుధీర్ బైరెడ్డి దర్శకుడు.(ఇదీ చదవండి: మాజీ భార్యకు దగ్గరుండి పెళ్లి చేసిన 'స్పైడర్‌మ్యాన్')రంగాపురం అనే ఊరిలో ఉండే గుడిలో విగ్రహాలు కనిపించకుండాపోతాయి. మరోవైపు ఓ వ్యక్తి చనిపోతాడు. ఈ కేసుని దర్యాప్తు చేసేందుకు పోలీస్ అయిన హీరో వస్తాడు. దేవుడంటే పెద్దగా నమ్మకం లేని ఇతడు.. ఈ విగ్రహాలు మిస్సింగ్ కేసుని ఎలా డీల్ చేశాడు? ఈ క్రమంలో ఏం తెలుసుకున్నాడనేది స్టోరీలా అనిపిస్తుంది.వచ్చే నెల 27న మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. టీజర్‌లోని విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. 'ఏం జరుగుతుందో చెప్పి, ఎలా జరుగుతుందో చూడమనే వాడే నయ్యా.. దేవుడంటే' డైలాగ్ కూడా ఆసక్తికరంగా అనిపించింది. మరి మూవీ ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'ద ఒడిస్సీ'.. అధికారిక ప్రకటన)


