టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ లేటేస్ట్ మూవీ హైందవ. ఈ చిత్రాన్ని డివోషనల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీకి లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ మూవీని నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ముందుగానే ప్రకటించారు.
తాజాగా ఈ మూవీ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకుడికి మరింత క్వాలిటీ కంటెంట్ అందించేందుకే వాయిదా వేస్తున్నట్లు నోట్ రిలీజ్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఎల్లప్పుడు మాకు మద్దతుగా నిలుస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. ఈనెల 27న రిలీజవుతున్న అని సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు నోట్‌లో పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తి, సౌరభ్ సచ్‌దేవా, మహేష్ మంజ్రేకర్, శివాజీ రాజా, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
#HAINDAVA has been postponed from its scheduled date to give you all the best experience with high technical standards 🙏❤️ A new release date will be announced soon. Stay tuned ✨ @BSaiSreenivas @iamsamyuktha_ @MaheshChandu @JDmaxmode @ludheerbyreddy @SamCSmusic @dop_harish https://t.co/IfLZuh6vOy
— Moonshine Pictures (@Moonshine_Pctrs) November 20, 2026


