మెగాస్టార్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న చిత్రాల్లో విశ్వంభర ఒకటి. ఇప్పటికే రిలీజ్ కావాల్సినా ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ తేదీని ఇంకా ప్రకటించలేదు మేకర్స్. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ అభిమానులు కాకా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే విశ్వంభరకు సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా ట్రైలర్ కట్ సహా డబ్బింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోందని లేటేస్ట్ టాక్. ఇప్పటికే ట్రైలర్ కూడా సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు డబ్బింగ్ పనులు సైతం త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఇదంతా చూస్తుంటే విశ్వంభర మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని అర్థమవుతోంది.
అయితే ఈ మూవీ రిలీజ్ తేదీని రివీల్ చేయాల్సి ఉంది. దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే విశ్వంభరకు లైన్ క్లియర్ అయినట్లేనని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక రిలీజ్ తేదీనిఎప్పుడు రివీల్ చేస్తారో తెలియాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీకి కీరవాణి, గౌర హరి సంగీతమదించగా.. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించారు.


