దుల్కర్ సల్మాన్ హీరోగా.. డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. సాత్విక వీరవల్లి హీరోయిన్ కాగా.. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా నేడు (నవంబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి స్పందన అందుకుంది. ఇప్పటికే సినిమా చూసిని సినీ ప్రముఖులు తమతమ అభిప్రాయాలను తెలియజేస్తుండగా.. తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఎన్టీఆర్ ఆ జాబితాలోకి చేరారు.
కలలు కనడం ఒక వరమని వాటిని నిజం చేసుకోవడానికి పట్టుదల, సంకల్పం అవసరమని పేర్కొన్నారు. ‘ఆకాశంలో ఒక తార’ చిత్రబృందంలో ఆ రెండూ ఉన్నాయని కొనియాడారు. నటీనటులందరి అద్భుతమైన నటనతో ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకుందని రాజమౌళి తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్ ఏమన్నారంటే..
కొత్తదనం ఉన్న కథలను ప్రోత్సహించడంలో ‘స్వప్న సినిమాస్’ ఎప్పుడూ ముందుంటుంది. మంచి సినిమాలపై అరవింద్, గీతా ఆర్ట్స్‌కు ఉన్న నమ్మకం మరోసారి ఈ చిత్రంతో కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లికి నా ప్రత్యేక అభినందనలు. సినిమా చాలా ఆసక్తికరంగా ఉంది’ అని అన్నారు.
(ఇదీ చదవండి: 'ఆకాశంలో ఒక తార' మూవీ రివ్యూ)
So many people close to me are part of #AakasamLoOkaTaara, which makes this one extra special… Swapna has always backed fresh and unique stories, and encouraging new talent has become the norm for @SwapnaCinema. Aravind garu and @GeethaArts, your belief in good cinema always shows. And @sunnygunnam, I know how much you and @ramya_gunnam have travelled with this project since its inception. The film looks so promising. Wishing @dulQuer, @pavansadineni, @satveeravalli, and the entire team all the very best for the release tomorrow!
— Jr NTR (@tarak9999) November 19, 2026



