breaking news
Aakasamlo Oka Tara Movie
-
ఇంట్రెస్టింగ్గా 'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరస సినిమాలు చేస్తున్నాడు. హీరో రానాతో పాటు 'కాంత' అనే మూవీని నిర్మిస్తున్న దుల్కర్.. అందులో హీరోగానూ చేస్తున్నాడు. 1950-60ల్లో ఓ హీరో-డైరెక్టర్ మధ్య జరిగే ఇగో క్లాష్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు తెలుగులోనే 'ఆకాశంలో ఒక తార' చిత్రంలోనూ నటిస్తున్నాడు. సోమవారం దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: దుల్కర్ సల్మాన్ 'కాంత' టీజర్ రిలీజ్)గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న 'ఆకాశంలో ఒక తార' సినిమాలో దుల్కర్ హీరో కాగా పవన్ సాధినేని దర్శకుడు. జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నాడు. గ్లింప్స్‌లో అలానే దుల్కర్‌ని ఓ సాధారణ కుర్రాడిగా చూపించారు. బ్యూటీఫుల్ విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే ఓ పల్లెటూరికి చెందిన కుర్రాడు.. అంతరిక్షంలోకి వెళ్లాలనే తన కల ఎలా నెరవేర్చుకున్నాడు అనేదే స్టోరీ అని కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చాయి. టీజర్, ట్రైలర్ వస్తే ఇది నిజమా కాదా అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు) -
‘ఆకాశంలో ఒక తార’అంటూ రాబోతున్న దుల్కర్ సల్మాన్
మల్టీటాలెంటెడ్, దక్షిణాది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా సినిమాకీ అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతోన్నారు. దుల్కర్‌కు ప్రస్తుతం తెలుగులో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ క్రేజీ డైరెక్టర్ పవన్ సాదినేనితో సినిమా చేస్తున్నారు.లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్‌ను పెట్టారు. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, గుణ్ణం గంగరాజు కలిసి ముందుకు వచ్చారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాయి. ‘ఆకాశంలో ఒక తార’ ఆదివారం నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్ వంటి వారు హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, అశ్విని దత్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించారు. నటీనటులు, ఇతర సిబ్బందికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. టాలెంటెడ్ సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫర్‌గా, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేయనున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.