క్లైమాక్స్‌లో 'ఆకాశంలో ఒక తార' | Aakasam Lo OkaTaara movie climax Shooting schedule in Rajahmundry | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్‌లో 'ఆకాశంలో ఒక తార'

Feb 9 2026 12:59 AM | Updated on Feb 9 2026 1:25 AM

Aakasam Lo OkaTaara movie climax Shooting schedule in Rajahmundry

దుల్కర్‌ సల్మాన్, సాత్విక వీరవల్లి హీరో హీరోయిన్లుగా, శ్రుతీహాసన్‌ ఓ కీలకపాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ నేడు (సోమవారం) రాజమండ్రిలో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లుపాల్గొనగా క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంటుంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో పవన్‌ సాధినేని దర్శకత్వంలో సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement