'సంజయ్ రామస్వామిని మళ్లీ చూస్తారు': నాగవంశీ | Tollywood producer Naga Vamsi comments about Suriya | Sakshi
Sakshi News home page

Naga Vamsi: 'సంజయ్ రామస్వామిని మళ్లీ చూస్తారు': నాగవంశీ

Aug 11 2026 10:07 PM | Updated on Aug 11 2026 10:07 PM

Tollywood producer Naga Vamsi comments about Suriya

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు సూర్యతో నిర్మాత నాగవంశీ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. సూర్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీతో సూర్యలో మరోసారి సంజయ్ రామస్వామిని గుర్తుకు తెస్తామని ప్రకటించారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నారు. మదర్‌ సెంటిమెంట్‌ ఈ మూవీలో మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమా చూశాక మీ మదర్‌ను పదిరెట్లు ఎక్కువగా ప్రేమిస్తారని అన్నారు. రాధిక క్యారెక్టర్ చూస్తే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూస్తారని అన్నారు. ఈ సినిమా త్రివిక్రమ్‌కు కూడా నచ్చిందని వెల్లడించారు. ఆయన మెచ్చుకున్న ఏ సినిమా నాది ఫెయిల్ అవ్వలేదని పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement