రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ చేతుల మీదుగా జరగగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘పిల్ల పిల్ల పిల్ల’ని నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల పిల్ల సాంగ్ చాలా బాగుంది. మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ..ఇండియన్ ఫిలిం ఫీల్డ్ లో సురేష్ ప్రొడక్షన్స్ కి ఉన్న పేరు మనందరికీ తెలుసు. సురేష్ బాబుచేతుల మీదుగా మా ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నరేష్ గారికి, కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న బెక్కం వేణుగోపాల్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో అద్భుతమైన పాటలు అందించిన ఆర్. ఆర్. ధృవన్ కి, అలాగే ఈ పాట పాడిన మనందరి ఫేవరెట్ సింగర్ జావేద్ అలీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నిర్మాత నరేష్ మాట్లాడుతూ..‘మా సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగింది. రామానాయుడు స్టూడియో అధినేత గోల్డెన్ హ్యాండ్ సురేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ తో మాకు ఇది రెండో సినిమా. తంత్ర మ్యూజికల్ గా ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవుతుంది. ధృవన్ గారే రాసి మ్యూజిక్ అందించి, జావేద్ అలీ గారితో పాడించిన ఈ పాట మంచి సక్సెస్ అవుతుంది. అదే విధంగా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ అందిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం’ అన్నారు.


