ముక్కుపుడక మింగేసిన హీరోయిన్‌.. వీడియో వైరల్‌ | Shehnaaz Gill Accidentally Swallows Nose Ring During Shoot, Video Goes Viral | Sakshi
Sakshi News home page

పొరపాటున ముక్కుపుడక మింగేసిన హీరోయిన్‌.. వీడియో వైరల్‌

Aug 11 2026 3:50 PM | Updated on Aug 11 2026 4:01 PM

Shehnaaz Gill Accidentally Swallows Nose Ring During Shoot, Video Goes Viral

షూటింగ్‌ సెట్‌లో చిన్న చిన్న ప్రమాదాలు జరగడం సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. నటీనటులు సన్నివేశాలను సహజంగా చూపించేందుకు చేసే ప్రయత్నాల్లో అనుకోని ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా ప్రముఖ నటి, గాయని షెహ్నాజ్ గిల్‌కు కూడా ఇలాంటి ఊహించని అనుభవమే ఎదురైంది. ఓ సన్నివేశం కోసం వేగంగా పరుగెత్తుతున్న సమయంలో ఆమె ముక్కుపుడక అనుకోకుండా ఊడి నోట్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

షెహ్నాజ్ గిల్ నటిస్తున్న తాజా పంజాబీ చిత్రం ‘ఇష్క్నామా’. అరవింద్ ఖైర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ సీన్‌ కోసం ఆమె వేగంగా పరుగెత్తుతుండగా.. ముక్కుకు ఉన్న పుడక అనుకోకుండా ఊడి నోట్లోకి జారిపోయింది.

ఈ ఘటనతో షెహ్నాజ్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. తీవ్రంగా దగ్గుతూ ఇబ్బంది పడుతున్న ఆమెకు పక్కనే ఉన్న సహనటుడు సౌరభ్ సచ్‌దేవా వెంటనే స్పందించారు. ఆమె వీపుపై తడుతూ సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను షెహ్నాజ్ గిల్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో చూసిన అభిమానులు షెహ్నాజ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. నటన పట్ల ఆమె చూపిస్తున్న అంకితభావాన్ని ప్రశంసిస్తూనే.. షూటింగ్ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సన్నివేశాలను పర్ఫెక్ట్‌గా చేయాలనే ప్రయత్నంలో నటీనటులు ఎదుర్కొనే ఇలాంటి అనుకోని ప్రమాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి.

ఇక ‘ఇష్క్నామా’ విషయానికి వస్తే.. భారత్‌లోని పంజాబ్‌కు చెందిన నిమ్మ అనే సిక్కు కవి, పాకిస్తాన్ పంజాబ్‌కు చెందిన నసీమ్ అనే ముస్లిం యువతి మధ్య సాగే సరిహద్దుల అతీతమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో షెహ్నాజ్ గిల్, జై రంధావా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సౌరభ్ సచ్‌దేవా, అంజుమ్ బత్రా, మహన్‌బీర్ భుల్లర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement