breaking news
nose ring
-
ముక్కుపుడక మింగేసిన హీరోయిన్.. వీడియో వైరల్
షూటింగ్ సెట్లో చిన్న చిన్న ప్రమాదాలు జరగడం సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. నటీనటులు సన్నివేశాలను సహజంగా చూపించేందుకు చేసే ప్రయత్నాల్లో అనుకోని ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా ప్రముఖ నటి, గాయని షెహ్నాజ్ గిల్‌కు కూడా ఇలాంటి ఊహించని అనుభవమే ఎదురైంది. ఓ సన్నివేశం కోసం వేగంగా పరుగెత్తుతున్న సమయంలో ఆమె ముక్కుపుడక అనుకోకుండా ఊడి నోట్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.షెహ్నాజ్ గిల్ నటిస్తున్న తాజా పంజాబీ చిత్రం ‘ఇష్క్నామా’. అరవింద్ ఖైర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ సీన్ కోసం ఆమె వేగంగా పరుగెత్తుతుండగా.. ముక్కుకు ఉన్న పుడక అనుకోకుండా ఊడి నోట్లోకి జారిపోయింది.ఈ ఘటనతో షెహ్నాజ్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. తీవ్రంగా దగ్గుతూ ఇబ్బంది పడుతున్న ఆమెకు పక్కనే ఉన్న సహనటుడు సౌరభ్ సచ్‌దేవా వెంటనే స్పందించారు. ఆమె వీపుపై తడుతూ సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను షెహ్నాజ్ గిల్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియో చూసిన అభిమానులు షెహ్నాజ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. నటన పట్ల ఆమె చూపిస్తున్న అంకితభావాన్ని ప్రశంసిస్తూనే.. షూటింగ్ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సన్నివేశాలను పర్ఫెక్ట్గా చేయాలనే ప్రయత్నంలో నటీనటులు ఎదుర్కొనే ఇలాంటి అనుకోని ప్రమాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి.ఇక ‘ఇష్క్నామా’ విషయానికి వస్తే.. భారత్‌లోని పంజాబ్‌కు చెందిన నిమ్మ అనే సిక్కు కవి, పాకిస్తాన్ పంజాబ్‌కు చెందిన నసీమ్ అనే ముస్లిం యువతి మధ్య సాగే సరిహద్దుల అతీతమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో షెహ్నాజ్ గిల్, జై రంధావా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సౌరభ్ సచ్‌దేవా, అంజుమ్ బత్రా, మహన్బీర్ భుల్లర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) -
చక్కనమ్మకు ముక్కెరందం
ఆడపిల్ల పుట్టగానే చాలా మంది తమ పాపకు చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, చెవులకు కమ్మలు, ముక్కుకు ముక్కు పుడక పెట్టి అందంగా అలంకరించి చూడచక్కని చిలకమ్మలా చూడాలనుకుంటారు. బుడిబుడి నడకలు వేసే సమయంలో గాజులు, కడియాలు, గజ్జలు కట్టి ఆనందిస్తుంటారు. కొన్నేళ్ల తర్వాత చెవులు, ముక్కు కుట్టించి తమ బాధ్యతను ప్రారంభిస్తారు. చెవులు, ముక్కు కుట్టించడం ఇప్పటికీ సాంప్రదాయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పట్టణాల్లో అధునిక పద్ధతులతో కుట్టిస్తున్నారు. కానీ పల్లెల్లో మాత్రం వరుసకు అమ్మమ్మ మాత్రమే బాలికలకు చెవులు, ముక్కు కుట్టిస్తారు. అందుకు ఆమెకు కానుకగా తాంబూలం, కొబ్బెరిగిన్నె, జాకెట్ పీస్ ఇస్తారు. తుమ్మ ముళ్లుతో ఎంతో చాకచక్యంగా కుట్టడం వీరి పనితనం. ఇక్కడ చిత్రంలో బాలికకు వరుసకు అమ్మమ్మ అయిన మరియమ్మ క్రిష్టిపాడు గ్రామంలో శనివారం చెవులు, మక్కు కుడుతుండగా చిన్నారులు, పెద్దలు ఇలా చూస్తూ ఉండిపోయా రు. ఈ దృశ్యం చూడముచ్చటగా కనిపించింది. – నంద్యాల జిల్లా -
దుర్గమ్మ మొక్కు తీర్చుకున్న సీఎం కేసీఆర్
-
దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించిన కేసీఆర్
సాక్షి, విజయవాడ: విజయవాడ కనకదుర్గ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి చేయించిన ముక్కుపుడకను నెత్తిన పెట్టుకుని మేళతాళాల మధ్య కేసీఆర్ ఆలయంలోనికి ప్రవేశించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్ ముక్కుపుడకను సమర్పించారు. అనంతరం వేద పండితులు కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సతీమణి, కోడలు మనవడు, పలువురు బంధువులు, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, కేసీఆర్‌ను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం గన్నవరం విమానాశ్రయం చేరుకుంది. వారికి ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కేసీఆర్ కుటుంబం నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దేవుళ్లకు వరుసగా మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు. ఇది వరకే తిరుపతి వెంకన్నకు కంఠహారం, సాలగ్రామహారం సమర్పించారు. కురవి వీరభద్రస్వామికి కోరమీసం, వరంగల్ భద్రకాళి అమ్మవారికి కిరీటం సమర్పించారు. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం బంగారం, విలువైన రాళ్లు, రతనాలు పొదిగి ప్రత్యేకంగా తయారు చేయించిన ముక్కు పుడకను సమర్పించారు. ఈ ముక్కుపుడక 11.29 గ్రాముల బరువు ఉంది. -
ముక్కుపుడక తెచ్చిన తంటా!
చెన్నై: మగువుల సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ముక్కుపుడక ఓ పెద్దావిడ ప్రాణం మీదికి తెచ్చింది. కేవలం అలంకరణ కోసమే కాకుండా.. మహిళలు సాంప్రదాయకంగా ముక్కు పుడకలు ధరించడం ఆనవాయితీ. అలా పెట్టుకున్న ముక్కుపుడక కాస్త ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. అది కాస్తా ప్రమాదవశాత్తు ఊపిరితిత్తుల్లో చేరి అపాయకరంగా మారిన ఘటన తమిళనాడు మదురై లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వెల్లమ్మాళ్ (78) అనే మహిళ ముక్కు పుడకను తొలగించడానికి బంధువులు ప్రయత్నిచినపుడు పొరపాటున దాని సీల నోట్లోకి జారి, ఊపిరితిత్తుల్లో అడ్డుపడింది. ఆ తర్వాత వారు ఆవిషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె అస్వస్థతకు గురైంది. తీవ్రమైన శ్వాస సమస్యతో గత నెలరోజులుగా ఇబ్బంది పడుతుండటంతో వైద్యులను సంప్రదించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ రే తీసినపుడు బంగారు ముక్కుపుడక స్క్రూ ఎడమ ఊపిరితిత్తిలో నిలిచిపోయినట్టు గమనించారు. ఆమెకు ఊపిరి తీసుకోవడం మరింత ఇబ్బంది కరంగా మారడంతో దాన్ని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో థొరాసిక్ సర్జరీ ద్వారా నుంచి దానిని తొలగించారు. బ్రాంకో స్కోపీ (శ్వాస నాళ అంతర్దర్శిని) సహాయంతో ఫోర్ సెప్స్‌తో దానిని బయటకు తీసారు. ఆపరేషన్ అనంతరం వెల్లమ్మాళ్ ఆరోగ్యం నిలకడగా ఉందని , సాధారణంగా శ్వాస తీసుకోకలుగుతోందని మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ కోసం గంట సమయం పట్టిందన్నారు.


