ప్రముఖ నటి, వైసీపీ నేత ఆర్కే రోజా గత పదిపదకొండేళ్ల నుంచి సినిమాలు చేయట్లేదు. అడపాదడపా షోల్లో మాత్రమే కనిపిస్తున్నారు. ఓ తమిళ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. తమిళంలో హిట్ అయిన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుంది?
(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)
రోజా రీఎంట్రీ ఇచ్చిన తమిళ సినిమా 'అన్బే డయానా'. పారి ఎలావళగన్ హీరో కమ్ దర్శకుడు. రమ్య రంగనాథన్ హీరోయిన్. జూలైలో తమిళం వరకు థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 28 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.
'అన్బే డయానా' విషయానికొస్తే.. కృష్ణ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఆంగ్లో ఇండియన్ అమ్మాయి డయానాతో ప్రేమలో పడతాడు. డయానా ఫ్రీ బర్డ్ అంటే మందు, సిగరెట్లు లాంటి అలవాట్లు ఉంటాయి. కానీ కృష్ణ భిన్నమైన వాతావరణంలో పెరుగుతాడు. డయానాతో ప్రేమకు కృష్ణ తల్లి సరళ(ఆర్కే రోజా) అడ్డు చెబుతుంది. తన కులానికే చెందిన మరో అమ్మాయితో కొడుకు పెళ్లి ఫిక్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? తను ప్రేమించిన డయానా కోసం కృష్ణ ఏం చేశాడు? కొడుకు ప్రేమ.. సరళలో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)


