రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. పోస్టర్స్ దగ్గర నుంచి పాటల వరకు చూస్తుంటే ఇది అయ్యప్ప దీక్ష, స్వామి మాల నేపథ్య కథతో తీశారని చాలామంది అనుకున్నారు. అయితే శబరిమలకు ఈ మూవీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి దర్శకుడు శివ నిర్వాణ స్పష్టం చేశాడు. వచ్చే శుక్రవారమే చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు: నాగార్జున)
'ఈ సినిమా స్టోరీకి శబరిమలతో ఎలాంటి సంబంధం లేదు. హీరో జీవితంలో 41 రోజుల అయ్యప్ప దీక్ష ఓ భాగం మాత్రమే. దీక్ష టైంలో అయ్యప్ప భక్తులు తమ అలవాట్లు, నియమావళి విషయంలో నిష్టగా ఉంటారు. వ్యసనాలు ఉన్న ఓ మనిషి ఈ దీక్ష స్వీకరించాల్సి వస్తే అతడు మద్యానికి దురంగా ఉండాల్సి వస్తుంది. దీంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. కఠినమైన నియమాలు ఉంటాయి కాబట్టి నేను అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యాన్ని తీసుకున్నాను. అంతే తప్ప శబరిమలతో సినిమా స్టోరీ కాదు. 41 రోజుల దీక్ష కథే మూవీని మరింత ప్లస్. దీక్షకు ముందు ఏం జరిగింది? దీక్షలో ఉన్నప్పుడు ఏం జరిగిందనే విషయాలు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి' అని డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో రవితేజ భార్యగా హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ నటించింది. జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు. తండ్రికూతురు అనుబంధం కూడా ఈ మూవీలో ప్రధానంగా ఉండనుందని ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది.
(ఇదీ చదవండి: అక్కకు పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా: హీరోయిన్)


