సమయానికి విలువ ఇస్తుంది: డి.సురేష్‌ బాబు | D Suresh Babu Launches Hushar Pittalu Teaser | Sakshi
Sakshi News home page

సమయానికి విలువ ఇస్తుంది: డి.సురేష్‌ బాబు

Aug 11 2026 12:08 AM | Updated on Aug 11 2026 12:08 AM

D Suresh Babu Launches Hushar Pittalu Teaser

అన్షు, సురేష్‌ బాబు, వాసవి

‘‘నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ ద్వారా ‘హుషార్‌ పిట్టలు’ సినిమా గురించి తెలిసింది. మా సురేష్‌ ప్రోడక్షన్స్ ప్రతినిధులు ఈ మూవీ చూసి పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వడంతో సురేష్‌ ఏషియన్  ఫిలింస్‌ ద్వారా విడుదల చేస్తున్నాం. ప్రేక్షకుల డబ్బు, సమయానికి విలువ ఇచ్చే చిత్రం ఇది’’ అని నిర్మాత డి.సురేష్‌బాబు తెలిపారు. అన్షు, వాసవి గణేషన్  జంటగా నటీంచిన చిత్రం ‘హుషార్‌ పిట్టలు’.

బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్  సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు ఈ నెల 15న విడుదల చేస్తున్నాయి. సోమవారం నిర్వహించిన ‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి డి.సురేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ బిక్షు మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో వాణిజ్య అంశాలతో పాటు ఓ సందేశం కూడా ఉంది’’ అని చెప్పారు. ‘‘ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని వాసవీ గణేషన్ , అన్షు, సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్  తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్, కెమెరామెన్‌ రుద్రసాయి, నటులు గోవర్థన్ , భాను, నవీన్  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement