బలరామ్ కృష్ణ, ఇమ్మాన్, ముగెన్ రావు, తాన్య
ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ముఖ్య తారాగణంగా నటించిన తమిళ చిత్రం ‘నిరమ్’. కె. స్క్వేర్ సినిమాస్ సమర్పణలో కె. బిందుమాధవి ఈ సినిమాను నిర్మించారు. పి. రాజేష్ సహ నిర్మాతగా, బలరామ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. బుధవారం జరిగిన ‘నిరమ్’ సినిమా తెలుగు ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్‌లో హీరో ముగెన్ రావ్ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మా ‘నిరమ్’ తెలుగు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ‘‘నాకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం.
మా సినిమా నచ్చితే, మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని తెలుగు ప్రేక్షకులను కోరుకుంటున్నాను’’ అని తెలిపారు బలరామ్ కృష్ణ. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్, సింగర్ ప్రవస్తి, డీవోపీ సంటానియో టెర్జియో, లిరిసిస్ట్ భారతీబాబు మాట్లాడారు. ‘నీ అమ్మాయితో కలిసి ఆరు మిస్సింగ్ కేసులు... ఈ నెలలో..’, ‘ఇప్పుడు లవ్ అనే పేరుతో వీళ్లు చేసే క్రైమ్ అన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి అయ్యా’, ‘ఇప్పుడు నా కీర్తన ఎక్కడ?... ఎక్కడికి వెళ్లి వెతకాలి’ అన్న డైలాగ్స్ ఈ ట్రైలర్‌లో ఉన్నాయి.


