పండంటి కవలలకు జన్మనిచ్చిన స్టార్ కపుల్ | Kollywood Actor Kavin And Monicka Blessed Twins | Sakshi
Sakshi News home page

డబుల్ ధమాకా.. కవలలకు జన్మనిచ్చిన స్టార్ కపుల్!

Jul 31 2026 9:56 AM | Updated on Jul 31 2026 10:07 AM

Kollywood Actor Kavin And Monicka Blessed Twins

కోలీవుడ్‌ యువ హీరో కవిన్‌ తండ్రి అయ్యాడు. అతని భార్య మోనికా కవలలకు జన్మనిచ్చారు. ఈ శుభ వార్తను కవిన్‌ ఎక్స్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తనకు ట్విన్స్ పుట్టారని.. వీరిలో ఒక పాప, ఒక బాబు ఉన్నారని కవిన్ ప్రకటించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. కాగా, కెవిన్‌,మోనికలది ప్రేమ వివాహం. కొన్నాళ్లుగా డేటింగ్‌ చేసిన ఈ జంట.. 2023లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 

కాగా కెవిన్‌ 'కనా కానమ్‌ కలలాంగల్‌' సీరియల్‌లో తొలిసారి కెమెరా ముందు నటించాడు. మొదటి సీరియల్‌తోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. శ్రావణన్‌ మీనాక్షి, తాయుమానవన్‌ వంటి సీరియల్స్‌తో బుల్లితెర హీరోగా మారాడు. 2017లో 'శత్రియాన్‌' చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేశాడు. ఆ తర్వాతి సంవత్సరమే 'నాట్పున్న ఎన్ననాను తెరియుమా' చిత్రంతో హీరోగా మారాడు. ప్రస్తుతం లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారతో కలిసి హాయ్‌ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి విష్ణు ఎడావన్ దర్శకత్వం వహిస్తుండగా.. విఘ్నేష్ శివన్, నయనతార, ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement