నెవర్‌ గివప్‌ | Dulquer Salmaan I am Game trailer released | Sakshi
Sakshi News home page

నెవర్‌ గివప్‌

Jul 31 2026 2:55 AM | Updated on Jul 31 2026 2:55 AM

Dulquer Salmaan I am Game trailer released

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఐ యామ్‌ గేమ్‌’. నహాస్‌ హిదాయత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కయాదు లోహర్, ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కదిర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. దుల్కర్‌ సల్మాన్, జోమ్‌ వర్గీస్‌ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 20న విడుదల కానుంది. గురువారం ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ట్రైలర్స్‌ను రిలీజ్‌ చేశారు. తెలుగు ట్రైలర్‌ను హీరో ఎన్టీఆర్‌ షేర్‌ చేశారు.

‘‘ఐ యామ్‌ గేమ్‌’ ట్రైలర్‌ వైబ్‌ నాకు నచ్చింది. ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. నా సోదరుడు దుల్కర్‌ సల్మాన్‌ చేతిలో మరో అద్భుతమైన సినిమా ఉందని నమ్ముతున్నాను. ఈ ప్రయత్నం సఫలం కావాలి’’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు ఎన్టీఆర్‌. ‘‘ఎవరో చెప్తుంటే విన్నాను... మన జీవితం అంతా దేవుడికి, సైతాన్‌కు మధ్య ఉన్న గ్యాంబ్లింగ్‌లాంటిదని.., ఒకడు గెలిస్తే ఇంకొకడు ఓడిపోవాలి’, ‘మనకు కావాల్సింది ఫస్ట్‌ బ్యాటింగ్, ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ స్కోర్‌ అండ్‌ ఫైనల్‌ విన్నింగ్‌’, ‘నెవర్‌ గివప్‌’ అన్న డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి.

‘‘దుల్కర్‌ సల్మాన్‌ కెరీర్‌లోని 40వ చిత్రం ఇది. దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్స్‌లో చిత్రీకరించిన ‘ఐ యామ్‌ గేమ్‌’ సినిమా ఓ స్టైలిష్‌ ఫాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లను అన్బు–అరివు మాస్టర్స్‌ కొరియోగ్రఫీ చేశారు’’ అని యూనిట్‌ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement