జపాన్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి హికిరు కురిబయాషి (Hikaru Kuribayashi) అరుదైన ఘనతను సాధించాడు. ఇంజనీరింగ్, విపత్తు సహాయం, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాల్లో ఉపయోగపడే అవకాశం ఉన్న ఒరిగామి-ప్రేరిత సిమ్యులేషన్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సైన్స్ పోటీలలో ఒకటైన రిజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ (ISEF) 2026లో టాప్‌లో నిలిచి వార్తల్లో నిలిచారు. ఒరిగామి (కాగితపు మడతల కళ) ఆధారంగా అతను తయారు చేసిన కంప్యూటర్ సిమ్యులేషన్ ప్రోగ్రామ్‌కు గాను రూ. 96 లక్షలకు పైగా (లక్ష డాలర్ల) నగదు బహుమతి లభించింది.
సైన్స్ విభాగంలో ప్రసిద్ధి చెందిన 'జార్జ్ డి. యాంకోపోలస్ ఇన్నోవేటర్ అవార్డు' (George D. Yancopoulos Innovator Award)ను కురిబయాషి గెలుచుకున్నారు. 2025లో కురిబయాషి ఒరిగామి విజ్ఞానశాస్త్రంపై తనకున్న అభిరుచిని మేళవించి, సంక్లిష్టమైన మడతల ఫలితాలను అంచనా వేయగల ఒక సిమ్యులేషన్ ప్రోగ్రామ్‌ను సృష్టించాడు. పైథాన్‌ను పోలిన జూలియా అనే ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి సుమారు ఆరు నెలలు పట్టింది. ఈ కృషి ఫలించి, అతని ప్రాజెక్ట్ అత్యుత్తమమైందిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,700 మందికి పైగా ఇతర ఉన్నత పాఠశాల విద్యార్థులను ఓడించి మరీ ఈ టాప్ బహుమతిని గెలుచుకుంది.
ఈ పోటీలో గెలుపు తన చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని కురిబయాషి అన్నారు. ఎనిమిదో తరగతిలో ISEF గురించి విన్నప్పటినుంచీ అందులో పాల్గొనాలని కలలు కన్నాను, కానీ అత్యుత్తమ బహుమతి గెలుచుకోవడం, ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటూ సంతోషాన్ని ప్రకటించారు.
చిన్నతనంలో తన నాయనమ్మ నేర్పించిన ఒరిగామి కళ, అలాగే హోక్కాయిడో అడవుల్లోని లేడీబగ్స్ (కీటకాలు) రెక్కలు, ఆకులు మడతపడే సహజమైన తీరును పరిశీలించడం ద్వారా ఆయనకు ఈ ఆలోచన వచ్చింది .ప్రకృతిపై ఒరిగామి ప్రభావం కేవలం కళాత్మక స్ఫూర్తికి మించి ఉంటుందని కురిబయాషి విశ్వాసం.

ఇదీ చదవండి: 'మిషన్ మంగళ్’నటికి చేదు అనుభవం : లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు
ప్రఖ్యాతి చెందిన 'జూలియా' (Julia) ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ 'మార్కోవ్ చైన్ మోంటే కార్లో' అల్గారిథమ్ సహాయంతో సంక్లిష్టమైన మడతల ఫలితాలను ముందే అంచనా వేసే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు. అంతేకాదు కోడింగ్ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో తప్పులు దొర్లే అవకాశం ఉండటంతో, సొంతంగానే కోడింగ్ అండ్ డీబగ్గింగ్ పూర్తి చేశారు. టోక్యో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల మార్గ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించడం విశేషం.
ఇదీ చదవండి : భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు
ఉపయోగపడే రంగాలు
ఉపగ్రహాలలో (Satellites) ఉపయోగించే సోలార్ ప్యానెళ్లను చిన్న స్థలంలో మడతపెట్టి, అంతరిక్షంలోకి వెళ్లాక విస్తరించేలా డిజైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే జపాన్‌లో భూకంపాలు, సునామీలు ఎక్కువగా వస్తుంటాయి. తక్కువ స్థలంలో సులభంగా రవాణా చేసి, అత్యవసర సమయాల్లో వేగంగా పెద్దవిగా నిర్మించగలిగే షెల్టర్ల (ఆశ్రయాల) తయారీకి ఈ సాంకేతికత ఎంతో తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: 144 ఏళ్ల క్రితం దుబాయ్ జనాభా 12 వేలు : ఇపుడు ఎంతో తెలుసా?


