కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా వస్తోన్న చిత్రం డీసీ. ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో లోకేశ్ సరసన వామిక గబ్బి హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.. తాజాగా మరో ట్రైలర్ విడుదల చేశారు.
ఇవాళ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. 'తప్పు చేస్తే దండించడానికిపోలీసులు వస్తారు.. కానీ, ఆ పోలీసులే తప్పు చేస్తే ఎవరిని అడుగుతారయ్యా' అనే డైలాగ్ ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో వామికా గబ్బీ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.


