జూలై 31 నుంచి ఓటీటీలో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్ | Horror Action Thriller Police Complaint Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

జూలై 31 నుంచి ఓటీటీలో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

Jul 30 2026 8:28 PM | Updated on Jul 30 2026 9:02 PM

Police Complaint OTT Streaming from July 31
  • తెలుగు, కన్నడ భాష‌ల్లో జూన్‌లో విడుద‌లైన చిత్రం
  • 300 థియేట‌ర్‌ల‌లో విడుద‌లై హిట్ టాక్

హారర్-యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్‌లో థియేటర్లలో విడుదలై మంచి స్పందనతో పాటు సానుకూల సమీక్షలు అందుకున్న ఈ చిత్రం, ఈ శుక్ర‌వారం (జూలై 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

తెలుగు, కన్నడ భాష‌ల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ప్రముఖ సినీ వెబ్‌సైట్లలోనూ, IMDbలోనూ మంచి రేటింగ్‌లు, పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది.

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై హారర్, థ్రిల్లర్, యాక్షన్ అంశాలను వినూత్నంగా మిళితం చేస్తూ రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలు పోషించారు. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించగా, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. వరలక్ష్మి శరత్‌కుమార్ త‌న కెరీర్‌లోనే తొలిసారిగా చేసిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది. దానికి తోడు నవీన్ చంద్ర యాక్టింగ్ కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది.

ఈ చిత్రంలో "చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ" అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను హారర్ థ్రిల్లర్ రూపంలో దర్శకుడు సంజీవ్ మేగోటి ఆవిష్కరించారు. హారర్, మిస్టరీ, యాక్షన్ అంశాలను సమతుల్యంగా మేళవిస్తూ ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా, సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన కృష్ణసాయి నటించిన ప్రత్యేక గీతం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని థ్రిల్లింగ్ కథనంతో చూపించిన ‘పోలీస్ కంప్లైంట్’ హారర్, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు థియేటర్లలో మంచి అనుభూతిని అందించింది. ఇప్పుడు అదే ఉత్కంఠభరిత అనుభవాన్ని జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ భాషల్లో ఇంట్లోనే ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement