కథానాయకల్లో శృతిహాసన్ వేరయ్య అని పేర్కొనవచ్చు. అంత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటి ఈమె. తనకు నచ్చింది చేయడంలోనూ, దానిని బహిరంగంగా వ్యక్తం చేయడంలోనూ ఈమె రూటే వేరు. ఇది ఆమెకు వారసత్వంగా అబ్బింది కావచ్చు. సకల కళా వల్లభుడు కమల్ హాసన్ వారసురాలు ఈమె అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.
నటిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో సత్తా చాటుకుంటున్న నటి శృతిహాసన్. నటిగానే కాకుండా సంగీత దర్శకురాలు ,గాయనీగా కూడా తన ప్రతిభను చాటుకుంటున్న ఈ బ్యూటీ తమిళంలో విజయ్ సేతుపతి సరసన నటించిన ట్రైన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా 2009లో లక్ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ నట పయనం 17 ఏళ్లుగా అప్రహతంగా కొనసాగుతోంది.
దీంతో తన సినీ ప్రస్థానం గురించి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ‘‘ ఈ పయనం నాకు నా గురించి ,నా వృత్తి గురించి ,మనుషుల గురించి చాలా నేర్పించింది. ఒక చిత్రం జయాపజయాలను మించి దాన్ని రూపొందించడానికి పెద్ద బృందం సమష్టి ప్రయత్నం చాలా అవసరమని తెలిసేలా చేసింది. ఈ 17 ఏళ్లలో చిత్తప్రశ్రమ నాకు చాలా నేర్పించింది . అంతకు మించి పెద్ద పాఠం కూడా చెప్పింది. శక్తివంతంగాను, మానస జక ధృఢత్వంగాను మార్చింది. ఎలాంటి విమర్శలైనా, సవాళ్లనైనా ఎదుర్కొనే మానసిక పరిపక్వతం పెంపొందించింది ‘‘ అని నటి శృతిహాసన్ పేర్కొన్నారు.


