నా ముఖం ఎవరూ పగలకొట్టలేదు : జగపతి బాబు వీడియో | Jagapathi Babu Latest X Post Goes Viral | Sakshi
Sakshi News home page

నా పెద్ద అమ్మాయి దగ్గర కాపీ కొట్టా.. జగపతి బాబు వీడియో వైరల్‌

Jul 30 2026 3:30 PM | Updated on Jul 30 2026 3:46 PM

Jagapathi Babu Latest X Post Goes Viral

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్‌ నటుల్లో జగపతి బాబు ఒకరు.  షూటింగ్ విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన సరదా విషయాలను అభిమానులతో పంచుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులు ఎంత సరదాగా, వైవిధ్యంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన తన ఎక్స్  ఖాతాలో పంచుకున్న ఒక వంటల వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అప్పుడప్పుడు తనకు ఇష్టమైన వంటలు చేస్తూ అలరించే జగపతి బాబు, ఈసారి ఇంట్లోనే స్వయంగా బిస్కెట్స్ తయారు చేశారు. ఓవెన్ నుంచి వేడి వేడి బిస్కెట్లను బయటకు తీస్తూ డిఫరెంట్ లుక్‌లో కనిపించిన ఆయన, వాటిని రుచి చూస్తూ మురిసిపోయారు. ఈ వీడియోకి ఆయన పెట్టిన క్యాప్షన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘నా పెద్ద అమ్మాయి దగ్గర చూసి ఈ బిస్కెట్ల తయారీ కాపీ కొట్టాను’ అంటూ జగపతి బాబు నవ్వులు పూయించారు. తనదైన మార్క్ హ్యూమర్‌తో ఆయన ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ పోస్ట్‌పై అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మాస్ అండ్ క్లాస్ కుకింగ్ జగ్గు భాయ్’, ‘కాపీ కొట్టినా మీ స్టైలే వేరు సార్’ అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ 'బిస్కెట్ రెసిపీ' వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ముఖానికి సర్జరీ..
వీడియో నవ్వులు పూయిస్తున్నా.. అందులో జగపతి బాబు ముఖం చూస్తే మాత్రం కాస్త తేడాగా అనిపిస్తుంది. ఆయన కళ్లకింద నల్లగా ఉంది. అలాగే లుక్‌ కూడా డిఫరెంట్‌గా ఉంది. దీనిపై వీడియోలోనే జగపతి బాబు వివవరణ ఇచ్చాడు.  ‘నా ముఖం ఎవడో పగలగొట్టినట్లు ఉంది. కానీ ఎవడూ కొట్టలేదు. నేనే సర్జరీ చేయించుకున్నాను. బాగానే ఉన్నాను’ అని జగ్గూ భాయ్‌ తనదైన స్టైల్లో క్లారిటీ ఇచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement