కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీస్ చేయనున్నారు.
తాజాగా రిషబ్ శెట్టికి సంబంధించిన ఓ టాక్ వైరల్‌గా మారింది. టాలీవుడ్ నిర్మాత నాగవంశీ నిర్మాణంలో ఓ భారీ మూవీ ప్లాన్ చేశారని టాక్. అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో భారీ హిస్టారికల్ యాక్షన్ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారట. కానీ ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.
ఈ మూవీ ఆగిపోవడానికి రిషబ్ శెట్టి పారితోషికమే కారణమని తెలుస్తోంది. కాంతార తర్వాత అనూహ్యంగా రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ పెరిగిపోయింది. దీంతో నిర్మాత నాగవంశీకి.. రిషబ్‌కు రెమ్యునరేషన్ విషయంలో వచ్చిన అభిప్రాయ భేదాలే వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పక్కనబెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే లేదు.


