సర్జరీ విజయవంతం.. ప్రముఖ ఆలయంలో రామ్ చరణ్ దంపతుల పూజలు | Ram charan and upasana visited Coimbatore Ayyappa Swamy Temple | Sakshi
Sakshi News home page

Ram charan: సర్జరీ సక్సెస్.. ప్రముఖ ఆలయంలో రామ్ చరణ్ దంపతులు

Jul 30 2026 4:49 AM | Updated on Jul 30 2026 4:50 AM

Ram charan and upasana visited Coimbatore Ayyappa Swamy Temple

రామ్ చరణ్ దంపతులు ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. మణికట్టు చికిత్స కోసం కోయంబత్తూరు వెళ్లిన మెగా జంట అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తుల్లాగే వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దర్శనం అనంతరం ఆలయ అధికారులు రామ్ చరణ్ దంపతులతో ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

r

ఇటీవలే పెద్ది మూవీతో రామ్ చరణ్ ప్రస్తుతం కోయంబత్తూరులో ఉన్నారు. రెండు రోజుల క్రితమే తనకు మణికట్టు సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రముఖ గంగా ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ఎనిమిది వారాల పాటు విశ్రాంతి అవసరమని తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభించాలని వైద్యులు సూచించారు. అయితే మరో నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండి హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement