breaking news
ayyappa swamy temples
-
ఏపీలో నూతనంగా నిర్మించిన అతిపెద్ద "ఆదియోగి" విగ్రహం ఎక్కడో తెలుసా (ఫొటోలు)
-
కడప : ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోఉత్సవం (ఫొటోలు)
-
కడప నగరం లో ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజా (ఫొటోలు)
-
శబరిమల వెళ్లే ప్రతి స్వామి తెలుసుకోవాల్సిన విషయాలు
-
శబరిమల ఆలయంలోకి మహిళలు
-
మహిళల ప్రవేశం.. ఆలయం మూసివేత
తిరువనంతపురం : శబరిమల ఆలయ ప్రవేశంపై మహిళల పంతం నెగ్గింది. 50ఏళ్ల కన్న తక్కువ వయసు ఉన్న ఇద్దరు మహిళలు బుధవారం శబరిమల ఆలయ ప్రవేశం చేశారు. అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50ఏళ్ల లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే తొలిసారి. బుధవారం తెల్లవారు జామున3.45 గంటల ప్రాంతంలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు హహిళలు అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.(అన్ని వయసుల వారికి అనుమతి) పోలీసుల సంరక్షణలో బిందు, కనకదుర్గ నల్లటి దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనానికి వెళ్లారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ బయటకు వచ్చి కేరింతలు కొడుతూ అయప్ప స్వామిని దర్శించుకున్నామని ఆనందంగా చెప్పారు. వీరిద్దరూ అయ్యప్పను దర్శించుకున్న వీడియో కూడా బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళలుగా(50ఏళ్లలోపు) వీరు చరిత్రకెక్కారు. ఆలయ మూసివేత ఇద్దరు మహిళా భక్తులు శబరిమల ఆలయంలోకి ప్రవేశంచడంతో అపచారం జరిగిందని ఆలయాన్ని మూసివేశారు. శుద్ది చేసిన తర్వాతే ఆలయ తలుపులు తెరుస్తామని ప్రధాన పూజారి చెప్పారు. భక్తుల కళ్లు కప్పి మహిళలు ఆలయంలోకి ప్రవేశించారన్నారు. పోలీసుల సహకారంతో అయప్ప స్వామిని దర్శించుకున్నారని చెప్పారు. మహిళల ప్రవేశాన్ని అయప్ప భక్తులు, సాంప్రదాయవాదులు తప్పుబట్టారు. అలయంలో అపచారం జరిగిందని గుడిని మూసివేశారు. సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆలయ తలుపులు తెరుస్తామని చెబుతున్నారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12.40గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. 12.40గంటల తర్వాత ప్రత్యేక పూజలు చేసి, ఒంటి గంటకు భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. మరో వైపు మహిళల ప్రవేశం నిజమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేయడంతో సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50ఏళ్ల మహిళలు ప్రవేశించకుండా దశబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సెప్టెంబరు 28ను సుప్పీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పుతో కేరళ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు అయ్యప్ప భక్తులు నిరసనలు చేపట్టారు. ఇటీవల కొంత మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా.. వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసులు భద్రత కల్పించినప్పటికీ భక్తులు మహిళలను ఆలయంలోకి వెళ్లనివ్వలేదు. అయితే ఈ సారి ఎలాంటి ఘర్షనలు లేకుండా నిశ్శబ్దంగా వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.(శబరిమలలో మహిళలను అడ్డగించిన ఆందోళనకారులు) -
నియమాల తోరణం
స్వాముల శరణుఘోషతో భక్తి పరిమళం జిల్లా నుంచి ఏటా లక్ష మంది శబరిమలైకి పయనం జిల్లాలో 40కి పైగా ఆలయాలు ద్వారపూడి, శంఖవరాలు శబరిమలై ప్రతిరూపాలు భారీ అన్నదానాలతో మానవ సేవ మాలధారణం ...నియమాల తోరణం. 45 రోజుల కఠోర దీక్ష చేపట్టి ఆచరించడం సామాన్యమైన విషయం కాదు. వణికిస్తున్న చలి ... వేకువ జామునే చన్నీళ్లతో స్నానం ...కాళ్లకు చెప్పులుండవు ... మాలధారణే తప్ప సాధారణ వస్త్రధారణ ఉండకూడదు. అంతా శాకాహారమే...బ్రహ్మచర్యం పాటిస్తూ... మద్యం, మాంసాహారం ఊసే ఉండకూడదు ... ఇది ఓ యజ్ఞం ... తపస్సు... ఈ తపస్సు నుంచి జీవన ఉషస్సు ఆవిష్కృతమవుతుందని భక్తుల నమ్మకం. – మండపేట, శంఖవరం కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం అయ్యప్పస్వామి. సుమారు మూడున్నర దశాబ్దాల కిందట మొదటగా కాకినాడకు చెందిన దండపాణి గురుస్వామి అయ్యప్ప దీక్ష చేపట్టారు. నాటి నుంచి ఏయేటికాయేడు స్వామి మాలధారులు పెరుగుతూనే ఉన్నారు. జిల్లా నుంచి ఏటా సుమారు లక్ష మంది అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్ర చేస్తున్నారు. జిల్లాలో తొలుత 1981 జూ¯ŒS 12న అనపర్తిలో తొలి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. తర్వాత మండపేట, ద్వారపూడి, కాకినాడ, రాజమండ్రి, శంఖవరం, అమలాపురం, గొల్లలమామిడాడ, ఆలమూరు, తూరంగి తదితర ప్రాంతాల్లో అయ్యప్పస్వామి ఆలయాలు వెలసి ఆధ్యాత్మిక కేంద్రాలుగా శోభిల్లుతున్నాయి. జిల్యా వ్యాప్తంగా దాదాపు 40కి పైగా ఆలయాలు ఉన్నాయని అంచనా. సన్నిధానంలో నిర్వహించే పూజా కార్యక్రమాలకు శబరిమల ఆలయం నుంచి అర్చకులను తీసుకువచ్చి ప్రసిద్ధి చెందిన పలు ఆలయాల్లో పూజలు చేయించడం పరిపాటి. స్వామివారి ఊరేగింపులోనూ కేరళ వాయిద్యాలు ప్రత్యేకతను చాటుతుంటాయి. ఆయా ఆలయాల వద్ద మకర సంక్రాంతి రోజున సన్నిధానంలో మాదిరి జ్యోతి దర్శనం కూడా నిర్వహిస్తున్నారు. శబరిమలైకు వెళ్లనివారు... శబరి యాత్రకు వెళ్లేందుకు వీలు కుదరని భక్తులు ఈ జిల్లాలోని ఆలయాలకు వస్తుంటారు. జిల్లాతోపాటు శ్రీకాకుళం, విజయనగం, విశాఖ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కృష్ణా తదితర జిల్లాల నుంచి మాలధారులు ఇక్కడకు వచ్చి ఇరుముడులు సమర్పిస్తుండటంతో జిల్లాలోని ద్వారపూడి, శంఖవరం మండలం సిద్ధివారిపాలెంలో గల అయ్యప్ప ఆలయాలు ఆంధ్రా శబరిమలైలుగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. గతేడాది చెన్నైలో వరదలు రావడంతో శబరిమలైకు రైళ్ల రాకపోకలు నిలిచిపోగా రాష్ట్రం నలుమూలల నుంచి స్వాములు తరలివచ్చి ద్వారపూడి, సిద్ధివారిపాలెం ఆలయాల్లోనే ఇరుముడులు సమర్పించుకున్నారు. ద్వారపూడి, రాజమండ్రి తదితర పలు ఆలయాల వద్ద నిత్యాన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సన్నిధానంలో జిల్లావాసుల అన్నదానం శబరిమలైలోని స్వామివారి సన్నిధానంకు వచ్చే భక్తులకు అన్నదానం చేయడంలోను జిల్లా ప్రత్యేకతను చాటుతోంది. మండల, జ్యోతి దర్శనం రోజుల్లో జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, మండపేట, తదితర ప్రాంతాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఒక్క మండపేట నుంచే ఎనిమిదేళ్లుగా శబరిమలైలో రోజుకు సుమారు పది వేల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నట్టు పట్టణానికి చెందిన గురుస్వాములు చెబుతున్నారు. పట్టణంలోని పలువురు స్వాములు కలిసి భక్తులు, దాతల నుంచి బియ్యం, ఇతర సరుకులను సేకరించి ప్రత్యేక వాహనంలో శబరిమల తీసుకువెళ్లి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో ప్రత్యేక రైళ్లలోను సామగ్రిని తరలించేవారు. ఆంధ్రా శబరిమలైగా ద్వారపూడి ద్వారపూడిలోని అయ్యప్ప ఆలయం ఆంధ్రా శబరిమలైగా ప్రసిద్ధి చెందింది. 1983లో గురుస్వామి ఎస్ఎల్ కనకరాజు ఆధ్వర్యంలో ఆలయం నిర్మించారు. ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. పైన అయ్యప్పస్వామి ఆలయం, కింద కనకదుర్గాదేవి ఆలయం ఉంటాయి. సింహం నోట్లోంచి వెళితే కనకదుర్గాదేవి ఆలయంలోకి వెళ్లవచ్చు. సింహం జూలు వెంబడి నిర్మించిన మెట్లగుండా వెళితే అయ్యప్ప ఆలయానికి వెళ్లవచ్చు. స్వామివారు పడమర ముఖంగా దర్శనమివ్వడం ప్రత్యేకత. స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఆకాశమార్గంగా పిలిచే ఒంటి స్తంభాలపై గాలిలో నిలిచినట్టుగా ఉండే వంతెన ఇక్కడ ప్రత్యేకతను చాటుతుంది. ఇక్కడ 18 మెట్లను ఏకశిలతో చేయించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల శివలింగం మరో ఆకర్షణ. భూమి అడుగున నిర్మించిన భూగర్భ జ్యోతిర్లింగాలయంలో శివలింగం శ్వేత వర్ణంతో ఉంటుంది. స్వామిని దర్శించుకోవాలంటే పురుషులు లుంగీ ధరించి చొక్కా విడిచి వెళ్లాలి. స్త్రీలు చీర, పరికిణి వంటి దుస్తులను ధరించాలి. మోకాలు లోతు నీటిలో 40 అడుగుల మేర నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకోవాలి. అయ్యప్ప ఆలయంతో పాటు వేంకటేశ్వరస్వామి, దుర్గామాత, శివాలయం, అంజనేయస్వామి తదితర ఆలయాలు నిత్యం భక్తులతో సందడిగా కనిపిస్తాయి. ∙ మాల ధరించేవారు... మాలను ధరించాలనుకునే భక్తులు మూడు సమయాల్లో దీక్ష చేపట్టవచ్చు. మండల దర్శనం (నవంబరు), జ్యోతి దర్శనం (జనవరి), విష్ణు దర్శనం (ఏప్రిల్) ముఖ్యమైనవిగా భావిస్తారు. వీటితోపాటు ప్రతి నెలా ఐదు రోజులుపాటు ఆలయ దర్శనం ఉంటుంది. యాత్ర ముఖ్య ఉద్దేశం పదునెనిమిది తత్వాలకు ప్రతిరూపమైన 18 సూత్రాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారని గురుస్వాములు చెబుతుంటారు. ఈ మెట్లు అషా్ఠదశ శక్తి పీఠాలకు, అష్టాదశ పురాణాలకు ప్రతిరూపమని ప్రతీతి. యాత్ర పవిత్రత ఈ పద్దెనిమిది మెట్లను అధిరోహించడంలోనే ఉంది. 40 రోజులు దీక్ష చేసి, ఇరుముడి శిరస్సున దాల్చిన అయ్యప్ప భక్తులు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు. పవిత్రమైనది పడిపూజ మెట్టుమెట్టుకొక అర్థం.. భక్తుల కదే పరమార్థం. అంటూ సాగే పడి పూజ పరమ పవిత్రమైనదిగా చెబుతారు. ముక్తి మార్గానికి దారి చూపే పదునెనిమిది మెట్లను పూజించే తీరు నయనానందకరంగా ఉంటుంది. స్వాములు అరటి డొప్పలపై హారతి కర్పూరాన్ని వెలిగిస్తూ పడిపాట పాడుతూ లయబద్దంగా చేసే నృత్యం కనువిందు చేస్తుంది. ఘనమైనది లక్షపత్రి పూజ అనుకున్నది జరగాలంటూ స్వామికి లక్షపత్రి పూజ చేస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని ప్రతీతి. దీక్షా ధారులైన అయ్యప్పలు అరటి డొప్పలతో మండపాన్ని నిర్మించి స్వామిని సహస్ర నామాలతోను, విఘ్నేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అమ్మవారికి (మాలిగైపురత్తమ్మ) అషో్టత్తరాలతో ఘనంగా పూజ నిర్వహిస్తారు. పంచామృతాలను నైవేద్యంగా పెట్టి, లక్ష మారేడు బిల్వాలతో, మిన్నంటే శరణుఘోషతో స్వామివారికి అర్చన చేస్తారు. దీక్షా నిబంధనలు తెల్లవారు జామున, సాయంత్రం చన్నీటితో తలస్నానం చేసి విభూది, గంథం, కుంకుమలతో నుదటిన బొట్టు పెట్టుకోవాలి. భూతల శయనం చేయాలి, సాత్వికాహారం భుజించాలి. మహిళలను రుతు సమయాల్లో చూడకూడదు. మాట్లాడరాదు. మృత దేహాన్ని చూడరాదు. సూతకము వచ్చిన ఇంటిని సందర్శించరాదు. అలా జరిగితే తలస్నానం చేసి, కర్పూర జ్యోతి వెలిగించి శరణఘోష చెప్పాలి. ప్రతి ఒక్కరూ నల్లని దుస్తులు ధరించాలి. ఎవరైనా భిక్షకు(భోజనం), వడికి (అల్పాహారం)ఆహ్వానిస్తే విధిగా వెళ్లాలి. దీక్షా సమయంలో కనీసం ఐదు పూజా, భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆరోగ్యానికెంతో మేలు ∙స్వకార్యానికి, స్వామి కార్యానికి దీక్ష వారధిలా పనిచేస్తుంది అయ్యప్ప మాల. మాల ధరించిన సమయంలో ఏక భుక్తం, భూతల శయనం, శీతల స్నానాలు శరీరానికి, మనసుకు సంజీవనిలా ఉపయోగపడుతాయి. ఒక్కపూట భోజనం వల్ల శరీరంలో మనిషికి కీడు చేసే కొవ్వు పదార్థాలు కరుగుతాయి. భూతల శయనం(నేలపై పడుకోవడం) వల్ల శరీరానికి ఉన్న వాతం వంటి తెలియని వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. శీతల స్నానం (చన్నీటి స్నానం) రజోగుణాన్ని అణచిపెట్టడమే కాకుండా హింసా ప్రవృత్తి, కోప ప్రకోపాలను నిలువరించడానికి ఉపయోగపతోంది. మరెన్నో ప్రయోజనాలు అయ్యప్పదీక్ష ద్వారా కలుగుతాయని పెద్దలు చెబుతుంటారు. కేరళను మరిపిస్తున్న ఆంధ్రా అయ్యప్ప సన్నిధి శంఖవరం : ఒంపులు తిరిగిన రహదారులు, పచ్చదనానికి ప్రతీకగా నిలిచే కొండ, కోనలు, నిత్యం పారే జలధారలు, ఆహ్లాదకర వాతావరణంలో శంఖవరం మండలం పెదమల్లాపురం శివారు సిద్ధివారిపాలెంలో హరిహర సుతుడు అయ్యప్పస్వామి కొలువుదీరాడు. కరిమల వాసుడు కొండల నడుమ వెలసిన చందంలో ఇక్కడ కూడా చుట్టూ 18 కొండలు ఉండటం విశేషం. దీంతో ఈ ప్రాంతం ఆంధ్రా శబరిమలైగా ఖ్యాతినార్జిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడి వస్తారు. ఇలా చేరుకోవాలి భక్తులు కత్తిపూడి, అన్నవరం చేరుకుని అక్కడ్నుంచి శంఖవరం వచ్చి ఇక్కడికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని ఆంధ్రా అయ్యప్ప సన్నిధికి చేరుకోవాలి. ఆటోలు అందుబాటులో ఉంటాయి. స్వామి సన్నిధిలో ఇరుముడులు ధరించేవారు.. ఇరుముడులు సమర్పించే వారి సౌకర్యార్థం ఇక్కడ అనేక ఏర్పాట్లు చేశారు. ఆలయ నిర్మాణం ఇలా... తన స్వప్నంలో ఇచ్చిన స్వామి సందేశాన్ని సాకారం చేస్తూ 2009లో పెదమల్లాపురం దగ్గర్లోని అంకంపాలెంలో వ్యవస్థాపక ధర్మకర్త కుసుమంచి శ్రీనివాసరావు భూపతి ఉపాలయాలను నిర్మించారు. వినాయకుడు, పార్వతీదేవి, రాముడు, హనుమంతుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాల్లో కొలువుదీరారు. ఉపాలయాల వద్దే మణికంఠ స్వామి జీవితగాథను వివరించే శిల్ప కళాచిత్రాలతో నిర్మించిన పందళరాజ భవంతి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. కేరళలోని పంబ మాదిరిగా ఏర్పాటు చేసిన జలస్థావరంలో పేటతుళ్లి ఆడిన భక్తులు అక్కడ్నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోని సిద్ధివారిపాలెం అయ్యప్ప స్వామి ప్రధానాలయానికి వనయాత్ర సాగించి వస్తారు. 2011 జూ¯ŒS 12న సిద్ధివారిపాలెంలో అయ్యప్పస్వామి వారి ప్రధాన ఆలయానికి ప్రారంభోత్సవం చేశారు. నాటి నుంచి స్వామి వారికి నిత్య ధూప, దీప, నైవేద్యాలు, భక్తులకు ఆదరణ నిర్మాణకర్త శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లభిస్తున్నాయి¬. కార్తికమాసంలో స్వామి సన్నిధికి వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. శబరిమలైలో మాదిరిగానే ఆంధ్రా శబరిమలైలో మకర సంక్రాంతి రోజున భక్తులకు కొండల మధ్య మకరజ్యోతి దర్శనం లభించే ఏర్పాట్లు చేశారు. స్వామిని మహిళలకు కూడా దర్శించుకోవచ్చు. 12 ఏళ్లుగా అన్నదానం అయ్యప్ప అనుగ్రహంతో 34 ఏళ్లుగా స్వామిమాలను ధరించే భాగ్యం కలిగింది. 12 ఏళ్లుగా సన్నిధానంలో అన్నదానం చేస్తున్నాం. ఎంతోమందిని శబరిమలై తీసుకు వెళ్లాను. – మీగడ శ్రీనివాసరావు, గురుస్వామి, మండపేట నిష్టతో చేస్తే ఫలితం ఏటా మాలధారణ చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాలంతో పాటు ప్రజల్లో భక్తిభావం పెరుగుతోంది. ఎంత నిష్టగా దీక్ష చేస్తే అంత ఫలితం ఉంటుంది. – మల్లిడి శ్రీనివాసరెడ్డి(మణికంఠ), గురుస్వామి, రాయవరం కాటేజీలు నిర్మిస్తాం స్వామి సన్నిధికి వస్తున్న భక్తుల కోసం ఆలయ ఆవరణలో కాటేజీలుSనిర్మించేం దుకు కృషి చేస్తున్నాం. – కె.శ్రీనివాసరావు భూపతి, ఆలయ నిర్మాణ కర్త , సిద్ధివారిపాలెం కేరళను తలపిస్తుంది కేరళ శబరిమలైలోని అయ్యప్పస్వామి ఆలయ సన్నిధి వాతావరణాన్ని ఆంధ్రా అయ్యప్పస్వామి సన్నిధి తలపింపజేస్తోంది. – కె.శ్రీనివాసకుమార్, మురమళ్ల, అయ్యప్పసేవా సమితి ఆరాధ్యదైవం శబరిమలై వెళ్లలేని భక్తులు ఆంధ్రా శబరిమలై అయ్యప్పస్వామి ఆరాధ్యదైవంగా నిలిచారు. ఆధ్యాత్మికత ఈ ప్రాంతంలో ఉట్టిపడుతోంది. – శివప్రసాద్, పెందుర్తి, విశాఖ జిల్లా రిపోర్టింగ్ : పి. విజయ్‌కుమార్, మండపేట, – కె. గుర్రాజు,శంఖవరం