కేరళలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు.
మొన్న(ఆదివారం) సాయంత్రం నుంచే దర్శనాలు ప్రారంభం కావడంతో వేల సంఖ్యలో భక్తలు తరలివస్తున్నారు. కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉండటంతో దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది.
అయితే సరైన సౌకర్యాలు లేక భక్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.
నడపండాల్‌లో కిక్కిరిసిపోయిన భక్తులు.. దర్శనానికి 4-6 గంటల సమయం
నడపండాల్ ఎంట్రీకి కిలోమీటరు దూరం నుంచే క్యూలైన్లు
శరణ్‌గుత్తి నుంచే మొదలువుతున్న క్యూలైన్
నీలిమల అధిరోహణ తర్వాత.. షెడ్లలో అయ్యప్పల పడిగాపులు
నీలిమల నుంచి శరణ్‌గుత్తి మార్గంలో.. పోలీసులు భక్తులను నిలిపివేస్తుండడంతో ఇదీ పరిస్థితి
ఈరోజు(బుధవారం) ఉదయం 7 గంటలకు నడపండాల్ క్యూలైన్లలో పరిస్థితి
పరిస్థితులు సద్దుమణిగేవరకు.. చిన్నపిల్లలను, వృద్ధులను యాత్రకు రావొద్దంటున్న ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)
పద్దెనిమిది మెట్లకు అనుమతించే ముందు రద్దీ నియంత్రణ
గణపతి హోమం సమీపంలో.. పద్దెనిమిది మెట్లను అధిరోహించేందుకు అయ్యప్ప భక్తుల నిరీక్షణ
సన్నిధానంలో ఫ్లైఓవర్ ఎక్కాక.. దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది..
కష్టాలకోర్చి అయ్యప్ప సన్నిధిని దర్శించుకుని, స్వామియే శరణం అయ్యప్ప అని శరణుఘోషతో కీర్తిస్తున్న భక్తులు
గణపతి హోమం వద్ద రద్దీ
శరణ్‌గుత్తి వద్ద జనమేజనం
పంపా నుంచి.. 15 గంటల నిరీక్షణ తర్వాత అయ్యప్ప దర్శనం
ఈ సారి అతికష్టమ్మీద వచ్చాను స్వామి.. ఓ భక్తుడి మనోభావం
హరిహరసుతన్.. ఆనంద చిత్తన్.. అయ్యన్ అయ్యప్ప స్వామియే.. శరణం అయ్యప్పా


