వరల్డ్‌కప్‌ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్‌ ఇదే..! | Indian Cricket Team Schedule After T20 World Cup 2026 | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్‌ ఇదే..!

Mar 9 2026 6:13 PM | Updated on Mar 9 2026 6:15 PM

Indian Cricket Team Schedule After T20 World Cup 2026

టీ20 వరల్డ్‌కప్‌ 2026 ముగిసిన నేపథ్యంలో టీమిండియా తదుపరి షెడ్యూల్‌ ఎంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. 20 రోజుల గ్యాప్‌ తర్వాత (మార్చి 28) ఐపీఎల్‌ 2026 ప్రారంభమవుతుంది. ఈ లీగ్‌ మే 31 వరకు కొనసాగుతుంది. ఆతర్వాతే టీమిండియా షెడ్యూల్‌ మొదలవుతుంది.

జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఇందులో ఓ టెస్ట్‌, వన్డే సిరీస్‌ జరుగుతుంది. టెస్ట్‌ మ్యాచ్‌ న్యూ చంఢీఘడ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జూన్ 6–10 వరకు జరుగుతుంది. అనంతరం జూన్‌ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేలు జరుగుతాయి.

ఆతర్వాత భారత్‌ జులైలో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం​ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20లు చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్‌హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్  వేదికలుగా జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో.. వన్డేలు ఎడ్జ్‌బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జులై 14, 16, 19 తేదీల్లో జరుగుతాయి.

అనంతరం భారత జట్టు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో 2 టెస్ట్‌లు, 2 టీ20ల సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. దీని తర్వాత సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలల్లో ఏషియన్‌ గేమ్స్‌ జరుగుతాయి. దాని తర్వాత భారత జట్టు స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌లు ఆడుతుంది. అనంతరం  స్వదేశంలోనే వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతుంది.  

అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి. ఈ ఏడాది చివర్లో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు జరుగుతాయి. 

Advertisement
 
Advertisement
Advertisement