బాబర్‌ ఆజమ్‌పై వేటు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోచ్‌ | Pakistan Head Coach Breaks Silence On Babar Azam ODI Exit, Makes Brutal Remark | Sakshi
Sakshi News home page

బాబర్‌ ఆజమ్‌పై వేటు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోచ్‌

Mar 9 2026 5:46 PM | Updated on Mar 9 2026 5:51 PM

Pakistan Head Coach Breaks Silence On Babar Azam ODI Exit, Makes Brutal Remark

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవల బంగ్లాదేశ్ పర్యటన కోసం 15 మంది సభ్యుల వన్డే జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టులో మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ లేకపోవడం అభిమానులకు ఆశ్చర్యానికి కలిగించింది. బాబర్‌ ఇటీవలికాలంలో మిగతా ఫార్మాట్లతో పాటు వన్డేల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అందుకే అతనిపై వేటు పడిందని అంతా అనుకున్నారు. అయితే దీనిపై పాక్‌ కోచ్‌ మరోలా వివరణ ఇచ్చాడు.

బంగ్లా సిరీస్‌ నుంచి బాబర్‌ను తప్పించలేదు.  ఈ సిరీస్‌ను యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చే వేదికగా చూస్తున్నాము. బాబర్‌తో పాటు సైమ్ అయూబ్, నసీమ్ షా కూడా జట్టులో లేరని గుర్తు చేశాడు. మొత్తంగా బాబర్‌పై పడింది వేటు కాదని, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసమే అతనికి విశ్రాంతినిచ్చారని స్పష్టతనిచ్చాడు.

కాగా, బంగ్లా సిరీస్‌కు దేశీయంగా సత్తా చాటుతున్న అబ్దుల్‌ సమద్‌, సాద్‌ మసూద్‌, షమైల్ హుస్సేన్, మాజ్ సదాకత్ వంటి  యువ ఆటగాళ్లతో పాటు టీ20 వరల్డ్‌కప్‌ 2026లో చెలరేగిపోయిన (2 సెంచరీల సాయంతో 383 పరుగులు) సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు కూడా అవకాశం లభించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాహీన్‌ అఫ్రిది కొనసాగాడు. కొత్తగా ఆరుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు.

బంగ్లా పర్యటనలో పాక్‌ మూడు వన్డేలు ఆడనుంది. ఢాకాలోని షేక్‌ ఏ బంగ్లా స్టేడియం వేదికగా మార్చి 11, 13, 15 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

జట్లు.. 
పాకిస్తాన్: షాహీన్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్ఱం, హారిస్ రౌఫ్, హుస్సేన్ తలత్, మాజ్ సదాకత్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీమ్, మొహమ్మద్ ఘాజీ ఘోరి, సాద్ మసూద్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా, షమైల్ హుస్సేన్.  

బంగ్లాదేశ్: మెహిదీ హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తంజిద్ హసన్, నజ్ముల్ హొసైన్ షాంటో, తౌహిద్ హ్రిదోయ్, లిట్టన్ దాస్, ఆఫిఫ్ హొసైన్, మహిదుల్ ఇస్లాం భుయాన్, రిషాద్ హొసైన్, తాన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం, నాహిద్ రానా.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement