హైదరాబాద్ : టీ–20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు ఆదివారం విజయ కేతనం ఎగుర వేయడంతో నగరంలో క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.
సాయంత్రం నుంచే టీవీలకు అతుక్కుపోయిన నగరవాసులు టీమ్ ఇండియా విజయంతో వీధుల్లోకి, రోడ్లపైకి వచ్చి టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని సందడి చేశారు. యువత జాతీయ జెండాలతో బైక్‌లపై నగర వీధుల్లో తిరుగుతూ వేడుకలు చేసుకున్నారు.


